Begin typing your search above and press return to search.

విజయ్ హిట్టు కోసం రష్మిక కావాల్సిందేనా..?

విజయ్ దేవరకొండ హిట్టు సినిమా కోసం అతనే కాదు అతని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 April 2024 1:44 PM GMT
విజయ్ హిట్టు కోసం రష్మిక కావాల్సిందేనా..?
X

విజయ్ దేవరకొండ హిట్టు సినిమా కోసం అతనే కాదు అతని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. టాక్సీవాలా తర్వాత వరుస క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాలు చేస్తున్నా సరే విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ పడట్లేదు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తో వచ్చిన మైలేజ్ తోనే కెరీర్ కొనసాగిస్తున్నాడు. అయితే యువ హీరోల్లో మోస్ట్ టాలెంటెడ్ గా ఆడియన్స్ చేత రాజమౌళి ముద్ర వేయించుకున్న విజయ్ దేవరకొండ ఇలా వెనకబడటం అతని ఫ్యాన్స్ కు డైజెస్ట్ అవ్వట్లేదు. అందుకే రాబోయే సినిమా ఎట్టి పరిస్థితుల్లో విజయ్ కి సూపర్ హిట్ పడాల్సిందే అని కోరుతున్నారు.

అయితే విజయ్ తో గీతా గోవిందం సినిమా హిట్ ఇచ్చిన హీరో రష్మిక చాలా క్లోజ్ గా ఉంటుంది. బయటకు క్లోజ్ ఫ్రెండ్స్ లా కనిపిస్తున్నా వీరిద్దరి మధ్య ఇంకా ఏదో జరుగుతుంది అని టాక్. అయితే రష్మిక ఇప్పుడు సూపర్ ఫాం లో ఉంది. ఆమె చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. సో విజయ్ దేవరకొండకు రష్మిక హిట్ ఇవ్వాలని కోరుతున్నారు. విజయ్ తో సినిమా అంటే రష్మిక ఎప్పుడూ సిద్ధమే. కానీ మేకర్స్ మాత్రం ఈ క్రేజీ కాంబోతో మంచి బ్లాక్ బస్టర్ కథ తీయాలని ప్లాన్.

అందుకే ఈ ఇద్దరిని కలిపి సినిమాలు చేయట్లేదు. విజయ్ ప్రస్తుతం గౌతం తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ, మమితా బైజు హీరోయిన్స్ గా నటిస్తారని టాక్. అయితే రష్మికతో విజయ్ కలిసి నటిస్తే ఆమె లక్ తనకు కలిసి వస్తుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. కనీసం విజయ్ సినిమాలో రష్మిక ఒక స్పెషల్ సాంగ్ చేసినా బాగుంటుందని అంటున్నారు.

అలా రష్మిక క్రేజ్ తో విజయ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. కెరీర్ లో విజయ్ దేవరకొండకు టఫ్ టైం నడుస్తుంది. సో మంచి కథతో విజయ్ సూపర్ హిట్ టార్గెట్ పెట్టాల్సి ఉంటుంది. అందుకే జెర్సీతో పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన గౌతం తిన్ననూరితో విజయ్ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాపై బజ్ బాగానే ఉంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ ఫ్యాన్స్ కోరుకునే సూపర్ హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి. రీసెంట్ గా విజయ్ కూడా రష్మికతో తను నటించే అవకాశం ఉందని కానీ అందుకు తగిన కథ కుదరాలని చెప్పారు. సో విజయ్ రష్మిక జోడీ త్వరలో చూడబోతున్నామని చెప్పొచ్చు.