Begin typing your search above and press return to search.

విజ‌య్ కోసం ఒప్పేసుకుందా?

హీరోయిన్ పాత్ర విష‌యంలో కొన్ని ర‌కాల మార్పులు చేయించేలా చూస్తాన‌ని హీరో ప్రామిస్ చేయ‌డంతో పాటు, స్నేహం కార‌ణంగానూ ర‌ష్మిక క‌న్విన్స్ అయింద‌ని తాజాగా తెర‌పైకి వ‌స్తోంది.

By:  Tupaki Desk   |   12 May 2024 4:30 PM GMT
విజ‌య్ కోసం ఒప్పేసుకుందా?
X

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వ‌లో ఓ సినిమాకి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి విజ‌య్ కి జోడీగా ర‌ష్మిక మంద‌న్ని తీసుకోవాల‌ని రాహుల్ సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఆమెకి స్టోరీ, రోల్ వినిపించగా పాత్ర విష‌యంలో ఆమె అసంతృప్తిగా ఉంద‌ని..రిజెక్ట్ చేసింద‌ని కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అమ్మ‌డు త‌న పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని స్నేహితుడు విజ‌య్ కోసం అలాంటి రోల్ చేస్తే త‌న కెరీర్ పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని ..ఆ కార‌ణంగానే వెన‌క్కి త‌గ్గుతున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది.

అయితే ఆపాత్ర‌కి ర‌ష్మిక అయితేనే న్యాయం చేయ‌గ‌ల‌న‌ది రాహుల్ అంతే న‌మ్మ‌డంతో ఆమెపైనే గురి పెట్టిప్ర‌య‌త్నాలు మాత్రం ఆప‌డం లేద‌ని తాజాగా తెలుస్తోంది. ఇటీవ‌లే రాహుల్ మ‌రోసారి విజయ్ వ‌ద్ద‌కు వెళ్లి జ‌రిగిందంతా వివ‌రించారుట‌.

దీంతో విజ‌య్ ర‌ష్మిక‌తో మాట్లాడి ఒప్పించిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తుంది. హీరోయిన్ పాత్ర విష‌యంలో కొన్ని ర‌కాల మార్పులు చేయించేలా చూస్తాన‌ని హీరో ప్రామిస్ చేయ‌డంతో పాటు, స్నేహం కార‌ణంగానూ ర‌ష్మిక క‌న్విన్స్ అయింద‌ని తాజాగా తెర‌పైకి వ‌స్తోంది.

త్వ‌ర‌లోనే అడ్వాన్స్ కూడా అందుకుంటుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో ర‌ష్మిక ముందుకొస్తేగానీ క్లారిటీ ఉండ‌దు. ప్ర‌స్తుతం ర‌ష్మిక కెరీర్ పుల్ స్వింగ్ లో ఉంది. బాలీవుడ్ లో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. లేడీ ఓరియేంటెడ్ ఆఫ‌ర్లు సైతం వ‌రిస్తున్నాయి. 'పుష్ప‌-2' రిలీజ్ త‌ర్వాత అమ్మ‌డి పాన్ ఇండియా క్రేజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకునే కొత్త‌ప్రాజెక్ట్ ల విష‌యంలో ఆచితూచి అడుగులేస్తుంది.

ఈ నేప‌థ్యంలో విజ‌య్ సినిమా విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ఎదుర్కుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇదొక పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా. 1854-1978 మ‌ధ్య కాలంలో జ‌రిగిన య‌ధార్ధ సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొంది స్తున్నారు. రాహుల్కి ద‌ర్శ‌కుడిగా మంచి పేరున్న సంగ‌తి తెలిసిదే. గ‌తంలో విజ‌య్ కి టాక్సీవాలా తో మంచి విజ‌యం అదిచాడు. అటుపై నేచుర‌ల్ స్టార్ నానితో శ్యామ్ సింఘ‌రాయ్ తెర‌కెక్కించాడు. ఇది డిఫ‌రెంట్ జాన‌ర్ లో తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు.