Begin typing your search above and press return to search.

సేమ్ నెమలి.. విజయ్, రష్మిక మళ్లీ దొరికేశారుగా!

దీనిపై కొన్ని సార్లు స్పందించిన వీరిద్దరూ.. పలుమార్లు నవ్వుతోనే ఆన్సర్ ఇచ్చేవారు.

By:  Tupaki Desk   |   4 April 2024 7:19 AM GMT
సేమ్ నెమలి.. విజయ్, రష్మిక మళ్లీ దొరికేశారుగా!
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మధ్య ఏదో సీక్రెట్ రిలేషన్ ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అంతా మాట్లాడుకునే ఉంటున్నారు. దీనిపై కొన్ని సార్లు స్పందించిన వీరిద్దరూ.. పలుమార్లు నవ్వుతోనే ఆన్సర్ ఇచ్చేవారు. విజయ్, రష్మిక మధ్య ఏం ఉన్నా లేకపోయినా ఇద్దరూ బాగా క్లోజ్ అని మాత్రం అందరికీ తెలుసు.


అయితే రష్మిక ప్రస్తుతం అబుదాబిలో ఉంది. అందుకు సంబంధించిన వీడియోను ఇటీవల ఇన్ స్టాలో షేర్ చూస్తూ ఇది నా బర్త్ డే వీక్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో రష్మిక.. తన బర్త్ డేను అక్కడే జరుపుకోనుందని క్లారిటీ వచ్చింది. ఇంకేముంది.. విజయ్ దేవరకొండ కూడా అక్కడికి వెళ్లి బర్త్ డే సెలబ్రేట్ చేయనున్నారని నిన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ ఒకే చోట ఉన్నారని ఫ్యాన్స్... ప్రూఫ్స్ తో సహా బయటపెట్టారు! అసలేం జరిగిందంటే?

రష్మిక తాజాగా ఒక నెమలి ఫొటోను షేర్ చేస్తూ బ్యూటిఫుల్ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అక్కడికి కాసేపటికే విజయ్ దేవరకొండ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో తన అప్ కమింగ్ మూవీ ఫ్యామిలీ స్టార్ గురించి చెప్పుకొచ్చారు. అయితే విజయ్ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో అదే నెమలి దర్శనమిచ్చింది. ఇక నెటిజన్లు ఆగుతారా?... ఈ రెండు స్టోరీలను ఎడిట్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

విజయ్, రష్మిక దుబాయ్ లో ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏప్రిల్ 5వ తేదీన రష్మిక బర్త్ డే కావడంతో అక్కడే సెలబ్రేట్ చేసుకోనున్నారని అంటున్నారు. ముందుగా దుబాయ్ కు రష్మిక వెళ్లిందని, ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లు కంప్లీట్ చేసుకుని విజయ్ కూడా నిన్న వెళ్లారని చెబుతున్నారు. దీంతో ఇద్దరూ మరోసారి వార్తల్లో నిలిచారు.

అయితే రష్మిక బర్త్ డే రోజే.. విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అవుతుండటం విశేషం. ఈ విషయంపై సీరియల్ యాక్ట్రెస్ కమ్ యూట్యూబర్ల చిట్ చాట్ లో ఆయనకు ప్రశ్న ఎదురైంది. "హా రష్మిక బర్త్ డే మాకు లక్కీ అవుతుందేమో" అంటూ విజయ్ నవ్వేశారు. ఇక ఈ చిత్రంలో రష్మిక గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. కళ్యాణి వచ్చా వచ్చా పాటలో రష్మిక ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి అది నిజమో కాదో.