విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా రష్మిక!
దీనిలో భాగంగా సొంతంగా ఓ ప్రయివేట్ జెట్ కూడా కొన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని కుటుంబంతో కలిసి జెట్ ఎక్కేస్తున్నాడు.
By: Tupaki Desk | 6 May 2025 10:30 PMవిజయ్ దేవరకొండకు వెకేషన్లకు సింగిల్ గా వెళ్లడం ఇష్టముండదు. కలిసి కుటుంబంతో వెళ్లడమంటేనే ఇష్టం. వెకేషన్ కేవలం తాను ఒక్కడే ఆస్వాదిస్తే కుటుంబ సభ్యులు ఎందుకు ఆస్వాదించకూడదు? అన్న కోణంలో కుటుంబంతో పాటు వెళ్లడం మొదలు పెట్టాడు. దీనిలో భాగంగా సొంతంగా ఓ ప్రయివేట్ జెట్ కూడా కొన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని కుటుంబంతో కలిసి జెట్ ఎక్కేస్తున్నాడు.
రీచ్ అయిన తర్వాత ఎంచక్కా వారం పది రోజులు టూర్ ఆస్వాదించి వస్తున్నాడు. తన అభిమానులకు కూడా అలాంటి అనుభూతి పొందాలని కొంత మందిన ఎంపిక చేసి మనాలీ కూడా పంపించిన సంగతి తెలిసిందే. దేవరకొండ వెకేషన్ ప్లానింగ్ అంటే ఇలా ఉంటుంది. అయితే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వెకేషన్ మాత్రం దేవరకొండకు భిన్నంగా ఉంది. టూర్ వెళ్లాలంటే మాత్రం తాను ఒక్కర్తే వెళ్తుందిట.
వెంట ఎవరు ఉన్నా? నచ్చదట. ఎవరైనా వస్తామంటే వద్దని చెబుతుందిట. సింగిల్ గా వెకేషన్ కి వెళ్తేనే అన్ని రకాల ఆస్వాదన పూర్తి చేయోచ్చు అంటోంది. ఇప్పటికే దుబాయ్, పారిస్ లను ఒంటరిగానే చూసొచ్చానంది. చిన్నప్పుడు చదువు, ఇంటి పరిస్థితుల కారణంగా కూర్గ్ ప్రాంతం దాటి ఎక్కడికి వెళ్ల లేదంది. కానీ హీరోయిన్ అయిన తర్వాత ..డబ్బు సంపాదన పెరిగిన తర్వాత నచ్చి న ప్రాంతాలకు ఎప్పుడు పడితే అప్పుడే చేరుకుని ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది.
అలా విజయ్-రష్మిక మధ్య వెకేషన్ వ్యత్యాసం కనిపిస్తుంది. వీళ్లిద్దరి మధ్య దేనికంటే? ఇద్దరు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. `గీత గోవిందం` దగ్గర నుంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత మరో సినిమా కోసం కలిసి పనిచేసారు. అలా వాళ్ల స్నేహం బలంగా మారింది. త్వరలో మళ్లీ కలిసి మరో సినిమా చేస్తారు అన్న ప్రచారం జరుగుతోంది.