Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తిని 27 నంబ‌ర్ వెంటాడుతోందా?

దీంతో విజ‌య్ తీవ్ర ఇబ్బందుల్ని, విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. దీనిపై సీబీఐ ఛార్జిషీట్ ధాక‌లు చేయ‌డం, విజ‌య్‌ని ఢిల్లీకి విచార‌ణ‌కు పిల‌వ‌డం తెలిసిందే.

By:  Ravindar Gorantla   |   3 March 2026 12:44 AM IST
ద‌ళ‌ప‌తిని 27 నంబ‌ర్ వెంటాడుతోందా?
X

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్టి క్రియాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్నారు. ఇప్ప‌టికే టీవీకే అనే పేరుతో పార్టీని స్థాపించి త‌మిళ‌నాడు రాజ‌కీయ పార్టీల్లో గుబులు పుట్టించారు. భారీ బ‌హిరంగ స‌భ‌ని ఏర్పాటు చేసి అభిమానులు, శ్రేయోభిలాషుల జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య త‌న రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించి రాష్ట్ర రాజ‌కీయాల్లో భారీ మార్పుల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం తెలిసిందే. అప్ప‌టి నుంచే విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ చుట్టూ నాట‌కీయ ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి.

ఇందులో 27 అనే నంబ‌ర్ విజ‌య్‌ని క‌ల‌వ‌ర‌పెడుతోంద‌ని నెట్టింట ప్ర‌చారం మొద‌లైంది. ఇంత‌కీ 27 నంబ‌ర్ వెన‌కున్న స్టోరీ ఏంటీ? దానికీ ద‌ళ‌ప‌తి విజ‌య్ చుట్టూ జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌కున్న సంబంధం ఏంటీ అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విజ‌య్ ఫ‌స్ట్ టైమ్ ప్ర‌చార స‌భ‌ని సెప్టెంబ‌ర్ 27న క‌రూర్‌లో ఏర్పాటు చేయ‌డం తెలిసిందే. ఈ ప్ర‌చార స‌భ సంద‌ర్భంగా అక్క‌డ ఘోర విషాదం చోటు చేసుకుంది. విజ‌య్ రోడ్ షో నిర్వ‌హించ‌డంతో అక్క‌డ అంచ‌నాకు మించి జ‌నం రావ‌డం, పోలీసులు అదుపు చేయ‌లేక‌పోవ‌డంతో ఘోర విషాదం చోటు చేసుకుని తొక్కీస‌లాట జ‌రిగిన దాదాపు 40 మందికి పైనే మృతి చెందారు.

దీంతో విజ‌య్ తీవ్ర ఇబ్బందుల్ని, విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. దీనిపై సీబీఐ ఛార్జిషీట్ ధాక‌లు చేయ‌డం, విజ‌య్‌ని ఢిల్లీకి విచార‌ణ‌కు పిల‌వ‌డం తెలిసిందే. ఆ త‌రువాత అక్టోబ‌ర్ 27న విక్టీమ్ మీట్ పేరుతో క‌రూర్ తొక్కిస‌లాట‌లో ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాల‌ని క‌లిసి విజ‌య్ ఓదాల్చ‌డం, దానిపై కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డం జ‌రిగింది. జ‌య‌ల‌లిత వీర విధేయుడు, అన్నాడీఎంకే పార్టీ బ‌హిష్కృత నేత సెంగొట్టెయాన్ న‌వంబ‌ర్ 27న విజ‌య్ స‌మ‌క్ష్యంలో టీవీకే పార్టీలో చేరారు. త‌ను టీవీకే పార్టీలో చేర‌డంతో త‌మిళ రాజ‌కీయాల్లో స‌రికొత్త చ‌ర్చ మొద‌లైంది.

ఈ విష‌యం పక్క‌న పెడితే జ‌న నాయ‌గ‌న్ ఆడియోలాంచ్‌ని డిసెంబ‌ర్ 27న కౌలాలంపూర్‌లో నిర్వ‌హించ‌డం, అక్క‌డి అధికారులు దీన్ని రాజ‌కీయ వేదిక‌గా భావించే ఎలాంటి స్టెట్మెంట్‌లు ఇవ్వ‌రాద‌ని, అలా ఇస్తే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని హెచ్చిక‌లు జారీ చేశారు. దీంతో `జ‌న నాయ‌గ‌న్` ఆడియో ఫంక్ష‌న్ వార్త‌ల్లో నిలిచింది. ఇక ఈ మూవీ రిలీజ్‌పై సెన్పార్ బోర్డ్ అభ్యంత‌రాలు తెల‌ప‌డంతో చిత్ర బృందం హైకోర్టుని ఆశ్ర‌యించింది. అయితే జ‌న‌వ‌రి 27న హైకోర్టు సెన్సార్ స‌ర్టిఫికెట్‌ని ర‌ద్దు చేస్తూ సినిమా రిలీజ్‌ని ప్ర‌భావితం చేయ‌డం తెలిసిందే.

వ‌రుస సంఘ‌ట‌న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న విజ‌య్‌కి ఆయ‌న వైఫ్ సంగీత ఫిబ్ర‌వ‌రి 27న త‌న‌కు విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ చెంల్ ప‌ట్టు జిల్లా కోర్టులో పిటీష‌న్ వేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 1999లో విజ‌య్‌, సంగీత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విజ‌య్‌తో 27 ఏళ్ల బంధానికి గుడ్ బై చెబుతూ సంగీత కోర్టుకి ఎక్క‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదే స‌మ‌యంలో ఈ వ‌రుస సంఘ‌ట‌న‌ల‌న్నీ ప‌రిశీలిస్తూ విజ‌య్‌ని 27 టెన్ష‌న్ పెడుతూ ఎంటాడుతోంద‌ని, మార్చి 27 విడాకుల కేసులో విజ‌య్‌కి ఎలాంటి షాక్ త‌గ‌ల‌నుందోన‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.