విజయ్ కు మరింత దగ్గరగా త్రిష
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది. దళపతి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీతోనే అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలను అందుకుంటున్నారు.
By: Tupaki Desk | 4 May 2026 2:09 PM ISTతమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది. దళపతి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీతోనే అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలను అందుకుంటున్నారు. టీవీకే పార్టీ అధికార పీఠానికి చేరువవుతున్న వేళ, చెన్నైలోని విజయ్ నివాసం వద్ద కోలాహలం కనిపిస్తోంది. గెలుపు దాదాపు ఖాయం కావడంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ గెలుపు ఉత్సాహంలో ఒక ఆసక్తికరమైన అతిథి రాక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి వెళ్తే తోటి నటీనటులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతుంటారు. కానీ నటి త్రిష మాత్రం నేరుగా విజయ్ ఇంటికే వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి వ్యక్తిగత జీవితాల గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ తన భార్యతో విడిపోతున్నారనే వార్తలు, అందులో త్రిష పేరు రావడం వంటి విషయాలపై నెటిజన్లు ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. అయితే వీటిపై అటు విజయ్ గానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు.
అసలు విషయం ఏంటంటే, నేడు త్రిష పుట్టినరోజు కావడంతో విషయం మరింత వైరల్ అయ్యింది. తన బర్త్‌డే సందర్భంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న త్రిష, అక్కడి నుంచి నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. తిరుపతి నుంచి తెచ్చిన లడ్డూ ప్రసాదాన్ని విజయ్‌కు అందించి ఎన్నికల్లో ఆయన సాధించిన విజయానికి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. ఒకవైపు విజయ్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుండటం, అదే రోజు త్రిష పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో బజ్ మరింత ఎక్కువైంది.
విజయ్ నివాసం వద్ద అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. త్రిష రాకతో అక్కడ ఒక్కసారిగా హడావుడి పెరిగింది. ఈ సంబరాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ కలయికను అభిమానులు పాజిటివ్ గానే చూస్తున్నారు.
తమిళ రాజకీయం ఒక కొత్త మలుపు తీసుకున్న తరుణంలో విజయ్ వ్యక్తిగత స్నేహబంధాలు కూడా హైలెట్ అవుతున్నాయి. ఇక మరోవైపు మే 8న 'జననాయగన్' సినిమా విడుదల కాబోతుండటం, అంతకంటే ముందే రాజకీయంగా ఇంతటి భారీ స్పందన రావడం విజయ్ కెరీర్ లోనే మరచిపోలేని ఘట్టం అని చెప్పాలి. ఇక విజయ్ త్రిషను పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజులుగా వస్తున్న వార్తలు. ఎన్నికల సమయంలో విడాకుల వ్యవహారం అలాగే త్రిషతో రూమర్స్ విజయ్ కు మైనస్ అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ విజయ్ మాత్రం అది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదని గట్టిగా చెప్పారు. ఇక జనాలు కూడా ఒక మార్పు కోరుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మరి విజయ్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.
