ట్రోలింగ్ కొత్తేం కాదు.. దాని నుంచి తప్పించుకోలేం
ఒక కొత్త సినిమా థియేటర్లలోకి వస్తుందంటే దానిపై నెగెటివిటీ క్రియేట్ చేసేందుకు ఓ బ్యాచ్ తయారవుతుంది.
By: Tupaki Desk | 14 July 2025 10:35 PM ISTఒక కొత్త సినిమా థియేటర్లలోకి వస్తుందంటే దానిపై నెగెటివిటీ క్రియేట్ చేసేందుకు ఓ బ్యాచ్ తయారవుతుంది. టార్గెట్ చేసి మరీ సోషల్ మీడియాలో సినిమా గురించి నెగెటివ్ ప్రచారం చేస్తారు. ఇది ప్రస్తుతం ట్రెండ్ అయిపోయింది. అయితే దీనిపై తాజాగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మాట్లాడారు. వరుస విజయాలతో జోరుమీదున్న ఆయన ఇప్పుడు 'తలైవన్ తలైవి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ సినిమాపై వచ్చే ట్రోలింగ్ ట్రెండ్ గురించి మాట్లాడారు. ఒక నటుడిగా తాను ఈ ట్రోలింగ్ ను ఎలా గ్రహిస్తారనే దాని గురించి వ్యాఖ్యానించారు. ఇలాంటి ట్రోలింగ్ విడుదలకు ముందే సినిమాలను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే దీని నుంచి బయట పడేందుకు మార్గం లేదన్నారు.
ట్రోలింగ్ సినిమాను ప్రభావితం చేస్తుంది. కానీ చివరకు ప్రేక్షకుల అభిప్రాయమే ఫైనల్ రిజల్ట్. సినిమాలపై ఈ ట్రోల్స్ ఇఫ్పుడే పుట్టినవి కాదు. గతంలోనూ సినిమాలపై ట్రోలింగ్స్ జరిగాయి. ఒక్కోసారి మేం బయటకు వెళ్తే, ప్రేక్షకులు మమ్మల్ని చూస్తు నవ్వుతారు. అది వాళ్ల ఉద్దేశ్యం. నా సినిమాను ఇలాగే చూడాలని వాళ్లకు చెప్పే అధికారం నాకు లేదు. మనం కష్టపడి ఓ సినిమా తీసి ప్రేక్షకులకు అందిస్తాం.
దాని రిజల్ట్ అనేది వారి అభిప్రాయం. మాకు ఇంకో మార్గం లేదు. మనల్ని కామెంట్ చేసినప్పుడు, ఆ వ్యాఖ్యల నుండి మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఇంకా ఏదైనా బెటర్ గా చేయడానికి ప్రయత్నించాలి. అని విజయ్ ట్రోలింగ్ ట్రెండ్ పై ఇలా రియాక్ట్ అయ్యారు.
అలాగే విజయ్ సేతుపతి తన కొడుకు సూర్య వివాదాస్పద వీడియోపైనా స్పందించారు. విజయ్ కొడుకు సూర్య ఫీనిక్స్ సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. అయితే ఇటీవల అతడు ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ టైమ్ లో బబ్బుల్ గమ్ నములుతూ మాట్లాడాడు. ఇది కాంట్రవర్సీకి దారీ తీసింది. దీనికి విజయ్ సారీ చెప్పారు. అది తన కుమారుడు కావాలని చేసింది కాదని, అతడి ప్రవర్తన పట్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని ఓ సందర్భంలో కోరారు.
కాగా, ప్రస్తుతం విజయ్- సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో ఓ సినిమా చేస్తన్నారు. ఈ చిత్రం షూటింగ్ ను ఇటీవల ప్రారంభించారు.
