ఆమెను మాత్రమే ఫాలో అవుతున్న సేతుపతి
తమిళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్, ఇప్పుడు కేవలం కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.
By: Tupaki Desk | 18 Jun 2025 2:00 AM ISTసినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి కెరీర్ స్టార్టింగ్ లో సైడ్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో, విలన్ పాత్రల్లో, హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సేతుపతి క్రేజ్ సౌత్ లో చాలా ఎక్కువ. దక్షిణాది టాప్ ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు. తక్కువ టైమ్ లోనే ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు విజయ్ సేతుపతి.
తమిళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్, ఇప్పుడు కేవలం కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఉప్పెన సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న సేతుపతి ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయడానికి రెడీ అవుతున్నాడు.
విజయ్ సేతుపతికి సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువే. ప్రస్తుతం ఆయనకు ఇన్‌స్టాలో 8.3 మిలియన్ ఫాలోవర్లున్నారు. తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన ఇన్‌స్టాలో ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతుండగా అందులో కేవలం ఒకే ఒక్క హీరోయిన్ ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు, టాలీవుడ్ హీరోయిన్, మన తెలుగు అమ్మాయి అంజలి. సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న అంజలి తెలుగుతో పాటూ తమిళంలో కూడా పలు సినిమాలు చేసిందన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అంజలి, సేతుపతితో కలిసి రెండు సినిమాలు చేయగా ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్లుగా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్ కు తమిళ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగే ఉంది. అంజలితో కలిసి పని చేసిన టైమ్ లో వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ బాండింగ్ తోనే సేతుపతి ఇన్‌స్టాలో అంజలిని ఫాలో అవుతున్నాడు.
