డ్యాషింగ్ డైరెక్టర్ సినిమాలో అందాల నటి
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది.
By: Tupaki Desk | 24 July 2025 1:15 PM ISTమక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తుండగా, మరో పాత్రలో సంయుక్తామీనన్ నటిస్తోంది. విజయ్ రోల్ ఇద్దరి భామలతోనూ ట్రావెల్ అవుతుంది. ప్రత్యే కంగా హీరోయిన్ అంటూ ఎవరూ ఇంకా కన్పమ్ అవ్వలేదు. ఇది పూరి శైలికి భిన్నమైన సినిమా. ఇంత వరకూ పూరి కాంపౌండ్ నుంచి ఈ జానర్ సినిమా రాలేదు.
అలాంటి స్టోరీ కావడంతో విజయ్ సేతుపతి అంగీకరించాడు. విజయ్ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాడని... ఇంత వరకూ ఇండియన్ స్క్రీన్ పై ఏ నటుడు పోషించని పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఇలా ఇన్ని రకాల ప్రచారం సినిమాకు మంచి హైప్ తీసుకొస్తుంది. పూరి వరుస ప్లాప్ ల్లో ఉన్నా ఈ సినిమాలో విజయ్ సేతుపతి భాగమవ్వడంతో? ఆ ప్లాప్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పూరి ఓ కొత్త ప్రయోగంతో గ్రాండ్ గా కంబ్యాక్ అవ్వడం ఖాయం అనే మాట బలంగా వినిపిస్తుంది.
తాజాగా ఈ సినిమాలో సీనియర్ నటి, అందాల రాశీ కూడా భాగమవుతుంది? అన్న వార్త వెలుగులోకి వచ్చింది. ఓ కీలకమైన పాత్రకు పూరి ఆమెను ఎంపిక చేసాడట. ఇందులో రాశీ పాత్ర కాస్త బోల్డ్ గానూ ఉంటుందని సమాచారం. ఇలాంటి బోల్డ్ పాత్రలకు రాశీకి కొత్తేం కాదు. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే రాశీ ఓ ఊపు ఊపింది. అటుపై బోల్డ్ పాత్రలతోనూ తనంకటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది.
మళ్లీ కొంత కాలంగా యాక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఎక్కువగా మామ్ పాత్రల్లో కనిపిస్తుంది. అలాంటి రాశీలో మళ్లీ బోల్డ్ యాంగిల్ ని పూరి తట్టి లేపుతున్నాడు. పూరి నటీమణుల్లో బోల్డ్ యాంగిల్ ని తీసుకు న్నాడంటే? అందులో డోస్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. తూతూ మంత్రంగా ఆ పాత్రలను చూపించడు. మార్కెట్ పరంగానూ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూసుకుంటాడు. పూరి కూడా తన సినిమాల్లో పాత్రలను కొన్ని క్యాలుక్లేషన్స ప్రకారమే తీసుకుంటాడు. ఆ లెక్క రాశీ విషయంలో ఎలా ఉంటుందో చూడాలి. రాశీకి టాలీవుడ్ లో ప్రత్యేకమైన ప్యాన్ బేస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
