Begin typing your search above and press return to search.

పూరి ప‌నిత‌నం గురించి విజ‌య్ సేతుప‌తి ఏమ‌న్నాడంటే?

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి హీరోగా పూరి జ‌గ‌న్నాధ్ ఓ సినిమా తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా తో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని పూరి క‌సి మీద ఉన్నాడు.

By:  Tupaki Desk   |   22 May 2025 11:03 AM IST
పూరి ప‌నిత‌నం గురించి విజ‌య్ సేతుప‌తి ఏమ‌న్నాడంటే?
X

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి హీరోగా పూరి జ‌గ‌న్నాధ్ ఓ సినిమా తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా తో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని పూరి క‌సి మీద ఉన్నాడు. స‌రైన స‌మ యంలో పూరికి విజ‌య్ సేతుప‌తి అవ‌కాశం ఇవ్వ‌డం కూడా కలిసొచ్చింది. ఇక ప్రూవ్ చేసుకోవాల్సింది పూరినే. దీంతో ఆయ‌న ఎలాంటి క‌థాంశంతో వ‌స్తున్నాడ‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

అలాగే ఈ సినిమా టైటిల్ కి సంబంధించి బ‌య‌ట ర‌క‌ర‌కాల ప్రచారం కూడా జ‌రుగుతుంది. ఈ నేపధ్యంలో తాజాగా హైద‌రాబాద్ విచ్చేసిన విజ‌య్ సేతుప‌తి ఆ ప్ర‌చారాల‌పై క్లారిటీ ఇచ్చారు. పూరి అంటే చాలా గౌర‌వం. ఆయ‌న తీసిన సినిమ‌లు చూసాను. ఆయ‌న క‌థ‌లు చాలా బాగుంటాయి. స్క్రిప్ట్ విన‌డానికి రెండు ..మూడు రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌నుకున్నా. కానీ కొన్ని గంట‌ల్లోనే ఆ పని పూర్తి చేసారు.

జూన్ లోనే షూటింగ్ ప్రారంభ‌మ‌వ‌తుంది. ఆడియ‌న్స్ కంటే ఎక్కువ ఎగ్జైట్ మెంట్ తో నేను ఎదురు చూస్తున్నా. సినిమాకు 'బెగ్గ‌ర్' అనే టైటిల్ పెట్టినట్లు వార్త‌లొస్తున్నాయి. అందులో వాస్త‌వం లేదు. అలాగే సినిమా గురించి ఏ ఐ క్రియేష‌న్స్ ఎక్కువ‌య్యాయి. వాటిని న‌మ్మోద్దు. ఏ విష‌య‌మైనా అధికార‌మంగా మేమే వెల్ల‌డిస్తాం అన్నారు. అలాగే విశాల్-విజ‌య్ ఎయిర్ పోర్టులో క‌లుసుకున్న సంగ‌తి తెలిసిందే.

దీంతో ఇద్ద‌రు అక్క‌డ ఏం మాట్లాడుకున్నారు. దీంతో ఆ టాపిక్ ఏమై ఉంటుంద‌ని నెట్టింట చ‌ర్చ‌కు దారి తీసింది. ఆ విష‌యాలు కూడా విజ‌య్ రివీల్ చేసాడు. 'విశాల్ తో కేవ‌లం పెళ్లి గురించే మాట్లాడాను? అలాగే రాజ‌కీయాల్లోకి వెళ్తారా? అని కూడా అడిగాను. కానీ ఆయ‌న ఏ స‌మాధానం చెప్ప‌లేదు. తాను మాత్రం రాజకీ యాల్లోకి వెళ్ల‌న‌ని సేతుప‌తి తెలిపాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడు నుంచి ద‌ళ‌ప‌తి విజ‌య్ బ‌రిలోకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇండ‌స్ట్రీ నుంచి విజ‌య్ కి ఎలాంటి మ‌ద్ద‌తు ద‌క్కుతుంది? అన్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.