Begin typing your search above and press return to search.

ప్లాప్ సెంటిమెంట్ తో ప‌నిలేకుండా బ‌రిలోకి పూరి!

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. పూరి ప్లాప్ ల‌తో సంబంధం లేకుండా సేతుప‌తి న‌మ్మి ఇచ్చిన అవ‌కాశం ఇది.

By:  Tupaki Desk   |   24 April 2025 8:45 AM IST
ప్లాప్ సెంటిమెంట్ తో ప‌నిలేకుండా బ‌రిలోకి పూరి!
X

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. పూరి ప్లాప్ ల‌తో సంబంధం లేకుండా సేతుప‌తి న‌మ్మి ఇచ్చిన అవ‌కాశం ఇది. ఆ న‌మ్మ‌కాన్ని పూరి అంతే నిల‌బెట్టుకోవాలి. పూరి శైలికి భిన్న‌మైన స్టోరీ కావ‌డంతోనే సేతుప‌తి ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ విష‌యంలో విజ‌య్ సేతుప‌తి అంతే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నాడు.

ఈ చిత్రాన్ని పూరి సొంత నిర్మాణ సంస్థ‌లోనే చార్మీ స‌హ‌కారంతో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్స‌వం చెన్నైలో జ‌రుగుతుంద‌ని వినిపిస్తుంది. పూరి తెలుగు, త‌మిళ్ రెండు భాష‌ల్లో తెర‌కెక్కించాలనుకుంటు న్నారుట‌. ఒక భాష‌లో రూపొందించ‌డం కంటే ఈ క‌థ‌ని రెండు భాష‌ల్లో నూ..ఇరు భాష‌ల న‌టుల్ని క‌లుపు కుని తెర‌కెక్కిస్తే మార్కెట్ ప‌రంగా మ‌రింత మెరుగ్గా క‌లిసొస్తుంద‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

ఒకే సినిమాని రెండు భాష‌ల్లో తెర‌కెక్కించడం పూరికి కొత్తేం కాదు. గ‌తంలో `రోగ్` చిత్రాన్ని క‌న్న‌డ, తెలుగు భాష‌ల్లో రూపొందించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లైగ‌ర్ చిత్రాన్ని హిందీ, తెలుగులో తెర‌కె క్కించారు. `రోగ్` న‌టుడు ఇషాన్ క‌న్న‌డ న‌టుడు. హీరోగా అదే తొలి సినిమా కావ‌డంతో రెండు భాష‌ల్లో చేసారు. విజ‌య్ కి `లైగ‌ర్` బాలీవుడ్ డెబ్యూ కావ‌డంతో రెండు భాష‌ల్లోనూ రూపొందించారు. అయితే ఇలా రెండు భాష‌ల్లో చేసిన సినిమాలు పూరికి క‌లిసి రాలేదు.

రెండు ప్లాప్ అయ్యాయి. అయినా పూరి ఆ సెంటిమెంట్తో సంబంధం లేకుండా విజ‌య్ తో రెండు భాష‌ల్లో రెడీ అవుతున్నాడు. విజ‌య్ సేతుప‌తి త‌మిళీయ‌న్ అయినా తెలుగులోనూ ఎంతో ఫేమ‌స్ న‌టుడు. త‌మిళ్ లో తెర‌కెక్కించి తెలుగులో డ‌బ్ చేసే అవ‌కాశం ఉంది. కానీ పూరి ఆ ఛాన్స్ తీసుకోవ‌డం లేదు. మార్కెట్ ప‌రంగా మెరుగ్గా ఉంటుంద‌నే ఇలా రెండు భాష‌ల‌కు పూనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.