సేతుపతి సినిమాలో ఆకాష్ పూరి!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాధ్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 May 2025 4:00 AM ISTమక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాధ్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పూరి సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్నాడు. ఇదొక డిఫరెంట్ చిత్రమని..ఆ కారణంగా సేతుపతి ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అతి త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. హీరోయిన్? విలన్ పాత్రలు ఎవరు పోషిస్తున్నారు? అన్నది ఇంకా బయటకు రాలేదు.
అయితే ఈ చిత్రంలో పూరి తనయుడు ఆకాష్ పూరి ఓ కీలక రోల్ పోషిస్తున్నాడట. పూరి ఆ పాత్రను స్పెష ల్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. ఆకాష్ వయసున్న కుర్రాడైతే ఆ పాత్రకు సరిపోతాడని భావించిన పూరి ఆకాష్ నే ఎంపిక చేసినట్లు వినిపిస్తుంది. మరి ఇందులో నిమెంతో తెలియాలి. ఆకాష్ కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. 'మెహబూబా'తో హీరోగా పరిచయమైన ఆకాష్ అటుపై 'రొమాంటిక్', 'చోర్ బజార్' లాంటి చిత్రాల్లో నటించాడు.
ఇవేవి ఆకాష్ ని స్టార్ గా మార్చలేకపోయాయి. దీంతో కొత్త అవకాశాలు రాలేదు. అటు డాడ్ పూరి కూడా వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. ఇలా రెండు రకాలుగా ఆకాష్ పై ప్రభావం పడింది. సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు? హీరో ఛాన్సులు రావడం లేదు. దీంతో పూరి ఖాళీగా ఉంచకుండా తన సినిమాలో కీలక పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అవకాశాల విషయంలో పూరి తనయుడిని ఎవరికీ రికమండీషన్ చేయరు? అన్న సంగతి తెలిసిందే.
ఎవరి అవకాశాలు వారే వెతుక్కోవాలి...నిలబడాలి అన్నది పూరి మనస్తత్వం. తలుచుకుంటే తానే సొంత నిర్మాణ సంస్థలో లేదా? బయట నిర్మాతతో సినిమా చేయగలడు. కానీ ఆకాష్ పై మార్కెట్ లేని కారణం గా ఆ సాహసానికి పూనుకోవడం లేదు. సినిమా తీస్తే తన సొంత డబ్బుతోనే తీయాలని పూరి చూస్తున్నాడు. అది జరగాలంటే పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కితే తప్ప సాధ్యపడదు.