విజయ్ తో పూరి పాత ఫార్మెట్ లోనేనా?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 July 2025 4:00 AM ISTమక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం తర్వాత ఇంతవరకూ రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. ఈ నేపథ్యంలో ముంబైలో మొదలవుతుందా? చెన్నై లో మొదలు పెడతారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ చిత్రాన్ని ఆ రెండు చోట్లా కాకుండా హైదరాబాద్ లో సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఓ భారీ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు.
ఇందులో విజయ్ సేతుపతి-సంయుక్తా మీనన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో హీరో-హీరోయిన్ కాంబినేషన్ సన్ని వేశాలు పూరి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా పూరి మేకింగ్ అంటే హీరోతో పాటు విలన్ పాత్రలతో తొలి షెడ్యూల్ మొదలవుతుంది. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ ని పక్కన బెట్టి హీరోయిన్-హీరోతో మొదలు పెట్టారు. అలాగే ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా లీకైంది.
ఈ చిత్రం షూటింగ్ కూడా చాలా వేగంగా పూర్తి చేసే ప్రణాళికతోనే పూరి ముందుకెళ్తున్నాడుట. గత సినిమాల తరహాలోనే రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడుట. దీంతో పూరి మళ్లీ పాత పద్దతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పూరి కెరీర్ ఆరంభం నుంచి 'ఇస్మార్ట్ శంకర్' వరకూ షూటింగ్ లను వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేసాడు. అయితే ఇలా రిలీజ్ చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పూరి తొందర పాటు కారణంగా చాలా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి విమర్శ వ్యక్తమైంది.
అలాగే కథలు రొటీన్ గా ఉంటున్నాయనే విమర్శ కూడా ఉంది. దీంతో 'డబుల్ ఇస్మార్ట్' నుంచి వేగం తగ్గించి నెమ్మదిగా చేస్తానని ప్రామిస్ చేసాడు. ఆ సినిమాకు అలాగే పనిచేసాడు. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పూరి మళ్లీ తన పాత ఫార్మెట్ లోనే సినిమా తీసి రిలీజ్ చేయా లని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
