Begin typing your search above and press return to search.

లైఫ్ లో ఆ హీరోతో సినిమా చేయ‌కూడ‌ద‌నుకున్నా!

ఆ అభిప్రాయ బేధాల కార‌ణంగా జీవితంలో ఎప్పుడూ క‌లిసి వ‌ర్క్ చేయ‌కూడ‌ద‌ని తామిద్దరూ డిసైడ్ చేసుకున్నార‌ట‌.

By:  Tupaki Desk   |   16 July 2025 11:55 AM IST
లైఫ్ లో ఆ హీరోతో సినిమా చేయ‌కూడ‌ద‌నుకున్నా!
X

మ‌నుషుల‌న్న త‌ర్వాత ఎవ‌రి మ‌ధ్య‌నైనా మ‌న‌స్ప‌ర్థ‌లు, గొడ‌వ‌లు, బేధాభిప్రాయాలు రావ‌డం స‌హ‌జం. అయితే అలా విభేదాలొచ్చాయ‌ని మ‌నుషుల్ని దూరం చేసుకుంటే జీవితానికి అర్థ‌మేముంటుంద‌ని విజ‌య్ సేతుప‌తి నిరూపించారు. గ‌తంలో సేతుప‌తికి, నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ పాండిరాజ్‌కు మ‌ధ్య కొన్ని అభిప్రాయ బేధాలు త‌లెత్తాయ‌ట‌.

ఆ అభిప్రాయ బేధాల కార‌ణంగా జీవితంలో ఎప్పుడూ క‌లిసి వ‌ర్క్ చేయ‌కూడ‌ద‌ని తామిద్దరూ డిసైడ్ చేసుకున్నార‌ట‌. కానీ తాము తీసుకున్న నిర్ణ‌యం ఊహించ‌ని విధంగా మారింద‌ని డైరెక్ట‌ర్ పాండిరాజ్ వెల్ల‌డించారు. విజ‌య్ సేతుప‌తి హీరోగా, పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా త‌లైవ‌న్ త‌లైవి. ఈ సినిమా జూన్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

నిత్యా మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ ఓ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో డైరెక్ట‌ర్ పాండిరాజ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో సేతుప‌తితో ఉన్న విభేదాల కార‌ణంగా ఎప్పుడూ క‌లిసి వ‌ర్క్ చేయ‌కూడ‌ద‌నుకున్న‌ప్ప‌టికీ, డైరెక్ట‌ర్ మిష్కిన్ బ‌ర్త్ డే పార్టీలో తామిద్ద‌రం మ‌ళ్లీ క‌లుసుకున్నామ‌ని తెలిపారు.

ఆ పార్టీలో సేతుప‌తి స్వ‌యంగా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి మ‌నం క‌లిసి ఓ సినిమా చేద్దామ‌ని ప్ర‌తిపాదించార‌ని, ఆ మాట‌లు త‌న గుండెను తాకాయ‌ని, అప్ప‌ట్నుంచి తామిద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్న దూరం తొల‌గిపోయి, పాత విభేదాలు ప‌క్క‌న పెట్టి కొత్త జ‌ర్నీ మొద‌లుపెట్టామ‌ని చెప్పారు. మిష్కిన్ పార్టీలో తామిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ త‌ర్వాతే ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేశాన‌ని, ఇందులో హీరో క్యారెక్ట‌ర్ కు సేతుప‌తినే బెస్ట్ సెలెక్ష‌న్ అనుకున్నాన‌ని చెప్పారు. క‌థ పూర్త‌య్యాక సేతుప‌తికి 20 నిమిషాల పాటూ క‌థ‌ను నెరేట్ చేయ‌గా ఆయ‌నే వెంట‌నే ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నార‌ని పాండిరాజ్ తెలిపారు. స్వ‌యంగా డైరెక్ట‌ర్ పాండిరాజే ఈ విష‌యం బ‌య‌ట‌పెట్ట‌డంతో సేతుప‌తి ఆలోచ‌న‌ను, మంచి మ‌న‌సును అంద‌రూ మెచ్చుకుంటున్నారు.