Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్ కి సీక్వెల్ కి ఆయ‌నా ఒకే!

ఈ క‌థ‌ను ఓ లైన్ గా చూసిన‌ప్పుడు రోటీన్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లా అనిపిస్తుంది. కానీ సామినాథ‌న్ స్క్రీన్ ప్లేను ఎంతో గ్రింప్పింగ్ రాసాడు.

By:  Tupaki Desk   |   10 May 2025 10:30 AM
బ్లాక్ బ‌స్ట‌ర్ కి సీక్వెల్ కి ఆయ‌నా ఒకే!
X

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ల్యాండ్ మార్క్ 50వ చిత్రం 'మ‌హారాజ' ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. నిధిల‌న్ స్వామినాధ‌న్ తెర‌కెక్కించిన త‌మిళ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రానికి తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. 20 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కించిన సినిమా 190 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి సేతుప‌తి కెరీర్ లోనే తొలి భారీ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రంగం సిద్ద‌మ‌వుతుంది.

ఇప్ప‌టికే సీక్వెల్ కి సంబంధించి సేతుప‌తితో స్టోరీ డిస్క‌ష‌న్స్ కూడా పూర్త‌య్యాయి. విజ‌య్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ప్ర‌స్తుతం స్వామి నాధ‌న్ పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేసే ప‌నిలో ప‌డ్డారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్ధంలోనే చిత్రాన్ని ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ది రూట్ - థింక్ స్టూడియోస్- ఫ్యాష‌న్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'మ‌హ‌రాజ్' అనే భిన్న‌మైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. అంత‌ర్లీనంగా క‌ర్మ సిద్ధాంతం అనే పాయింట్ తో ముడిప‌డి ఉంటుంది. ఈ క‌థ‌ను ఓ లైన్ గా చూసిన‌ప్పుడు రోటీన్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లా అనిపిస్తుంది. కానీ సామినాథ‌న్ స్క్రీన్ ప్లేను ఎంతో గ్రింప్పింగ్ రాసాడు. సింపుల్ గా మొద‌లైన క‌థ ఊహ‌కంద‌ని విధమైన ట్విస్టుల‌తో ఆస‌క్తిక‌రంగా మ‌లిచాడు. క‌థ‌లో అంతే భావోద్వేగాన్ని హైలైట్ చేసాడు.

ఇంటర్వెల్..క్లైమాక్స్ ఎపిసోడ్ లో వ‌చ్చే మ‌లుపులు సేతుప‌తి యాక్ష‌ణ్ హంగామా ఎంతో ఆక‌ట్టుకుంటాయి. క్లైమాక్స్ ను ఎంతో భావోద్వేగంతో ముగించాడు. దీంతో సీక్వెల్ క‌థ , క‌థ‌నాలు ఎలా ఉండ‌బోతాయి? అన్న ఆస‌క్తి అప్పుడే మొద‌లైపోయింది. మ‌హారాజ కి సీక్వెల్ ఉంటుంద‌ని ఎలాంటి లీడ్స్ ఇవ్వ‌లేదు. దీంతో ఓ కొత్త పాయిట్ తో సీక్వెల్ రూపొందుతుంద‌ని అంచ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.