Begin typing your search above and press return to search.

పూరి టాలెంట్ పై సేతుపతి నమ్మకం.. ఎంతలా ఉందంటే..

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా అంటేనే హీరోల క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది

By:  M Prashanth   |   20 April 2026 1:05 PM IST
పూరి టాలెంట్ పై సేతుపతి నమ్మకం.. ఎంతలా ఉందంటే..
X

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా అంటేనే హీరోల క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ హీరోలను చూపించడంలో ఆయన స్టైలే వేరు. అయితే గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న పూరీ, ఈసారి మాత్రం తన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి ఆయన చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.





​అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ కేవలం ఐదు నెలల్లోనే పూర్తయిపోయింది. పూరీ తన పాత స్పీడ్ ను మళ్ళీ చూపిస్తూ సినిమాను చకచకా ముగించేశారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పూరీ జగన్నాథ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూనే, ఈ సినిమా తనకెంతో స్పెషల్ అని పేర్కొన్నారు. సినిమాకు 'స్లమ్‌ డాగ్: 33 టెంపుల్ రోడ్' అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు.

​ఈ సినిమాలో విజయ్ సేతుపతి లుక్ అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. ఆయన ఇప్పటికే ఒక బిచ్చగాడి పాత్రలో కనిపిస్తారనే క్లారిటీ ఇవ్వగా షూటింగ్ స్పాట్ లోని ఫోటోలతో మరోసారి క్లియర్ గా చెప్పేశారు. చిరిగిన బట్టలు, చెదిరిన జుట్టుతో సేతుపతి పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. సమాజంలో అట్టడుగున ఉండే ఒక వ్యక్తి జీవితాన్ని పూరీ తనదైన శైలిలో ఎలా ఆవిష్కరించారో చూడాలి. సాధారణంగా హీరోలను ఫుల్ స్టైలిష్ గా చూపించే పూరీ, ఈసారి ఇలాంటి డీ గ్లామరైజ్డ్ పాత్రను ఎంచుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉండి ఉంటుంది.

​సినిమాలో సీనియర్ నటి టబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమెతో పాటు సంయుక్త మీనన్ కూడా ఉండటంతో కాస్టింగ్ పరంగా సినిమా చాలా బలంగా కనిపిస్తోంది. విజయ్ సేతుపతి తన పోస్ట్ లో పూరీ గురించి చెబుతూ.. నటీనటులను వారి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చి కొత్తగా చూపిస్తారని ప్రశంసించారు. షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా టీమ్ అంతా కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

ఛార్మీ కౌర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ​పూరీ జగన్నాథ్ కి ఇది 26వ ఏడు కావడంతో, ఈ సినిమాతో మళ్ళీ తన పాత వైభవాన్ని అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. సేతుపతి లాంటి నటుడు తోడవ్వడం ఈ ప్రాజెక్ట్ కి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. కంటెంట్ పరంగా పక్కాగా ఉంటే, పూరీ మార్క్ డైలాగులు తోడైతే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, త్వరలోనే టీజర్ వచ్చే అవకాశం ఉంది. పూరీ మళ్ళీ తన ఫామ్ లోకి వచ్చి ఒక సాలిడ్ హిట్ కొడతారో లేదో చూడాలి.