Begin typing your search above and press return to search.

కొడుకు ప్రవర్తనకు క్షమాపణ చెప్పిన విజయ్‌ సేతుపతి

తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు. ఆయన కొడుకు వ్యవహరించిన తీరుకు గాను కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   7 July 2025 11:38 AM IST
కొడుకు ప్రవర్తనకు క్షమాపణ చెప్పిన విజయ్‌ సేతుపతి
X

తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు. ఆయన కొడుకు వ్యవహరించిన తీరుకు గాను కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడి ప్రవర్తన, పెద్దల పట్ల అతడు అగౌరవంగా వ్యవహరించినట్లు ఉందంటూ సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొడుకు సూర్య సేతుపతి చేసిన పనికి తాను క్షమాపణ చెబుతున్నాను అంటూ విజయ్‌ సేతుపతి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేయడంతో అసలేం జరిగింది అంటూ అంతా ఈ విషయమై చర్చించుకోవడం మొదలు పెట్టారు. కొడుకు వల్ల విజయ్ వంటి స్టార్‌ క్షమాపణ చెప్పడాంటే ఏ పెద్ద తప్పు చేశాడో అని చాలా మంది అనుకుంటున్నారు.

విజయ్‌ సేతుపతి క్షమాపణ చెప్పాల్సినంతగా పెద్ద తప్పు సూర్య సేతుపతి ఏమీ చేయలేదు. తన ప్రవర్తనకు సూర్యతోనే చిన్న సోషల్‌ మీడియా పోస్ట్‌ పెట్టించినా సరిపోయేది. కానీ విజయ్‌ సేతుపతి స్వయంగా తానే క్షమాపణ చెప్పడం జరిగింది. అసలు విషయం ఏంటంటే... ఇటీవల సూర్య సేతుపతి ఒకానొక సమయంలో అభిమానులతో, అక్కడ ఉన్న మీడియా వారితో మాట్లాడుతున్న సమయంలో బబుల్‌గమ్‌ చూయింగ్‌ చేస్తూ ఉన్నాడు. అక్కడ చాలా పెద్ద వారు ఉన్నారు, వారితో సూర్య మాట్లాడుతున్న సమయంలోనూనే చూయింగ్‌ చేస్తూనే కనిపించాడు. దాంతో సూర్య ప్రవర్తనను చాలా మంది ఖండించారు, పెద్ద వారితో ఎలా ఉండాలో తెలియడం లేదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మీడియాలో సూర్య సేతుపతి గురించి మరింత వివాదం చెలరేగక ముందే క్షమాపణ చెబితే ఉత్తమం అని విజయ్ సేతుపతి భావించి వెంటనే క్షమాపణ చెప్పాడు. సూర్య కావాలని చేసింది కాదని, తెలియనితనంతో అతడు అలా చేశాడని, మరోసారి అలా జరగకుండా చూసుకుంటామని, అతడి ప్రవర్తన విషయంలో ఎవరైనా హర్ట్‌ అయ్యి ఉంటే అందరికీ క్షమాపణ చెబుతున్నాను అంటూ విజయ్‌ సేతుపతి ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం గురించి విజయ్ సేతుపతి అభిమానులతో పాటు అంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు సూర్య సేతుపతి గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అతడి లుక్‌కి చాలా మంది ఫిదా అవుతున్నారు.

భవిష్యత్తులో సూర్య సేతుపతి హీరోగా వస్తాడేమో అంటూ చాలా మంది ఇప్పటి నుంచే చర్చ మొదలు పెట్టారు, కొందరు సూర్య ను ఇండస్ట్రీకి తీసుకు రావాల్సిందే అంటూ అభిమానులు విజయ్‌ సేతుపతిని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చదువుకుంటున్న సూర్య సేతుపతి ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అది ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్‌ సేతుపతి కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఏడాదికి అర డజను సినిమాలను చేస్తున్న విజయ్ సేతుపతి కొడుకు కెరీర్‌ను ఎలా ప్లాన్‌ చేస్తాడో చూడాలి. విజయ్ సేతుపతికి కొడుకుతో పాటు కూతురు కూడా ఉన్న విషయం తెల్సిందే. తను ఇండస్ట్రీలో అడుగు పెడుతుందా లేదంటే దూరంగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.