ఒకే కారులో విజయ్, రష్మిక.. మళ్ళీ అవే కామెంట్స్!
ముంబై ఎయిర్ పోర్ట్ లో రీసెంట్ గా ఇద్దరూ కలిసి కనిపించారు. ఆ తర్వాత ఒకే కారులో ప్రయాణించారు.
By: Tupaki Desk | 18 Jun 2025 12:39 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలేషన్ లో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీలతో సినీ ప్రియులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్న వారిద్దరూ.. ఆన్ స్క్రీన్ జోడీగా కాస్త ఆఫ్ స్క్రీన్ జోడీగా కావాలని అంతా కోరుకుంటున్నారు.
ఇప్పటికే వీరిద్దరూ పలుమార్లు కలిసి కనిపించారు. ఎయిర్ పోర్ట్ లో ఒకరి తర్వాత మరొకరు సందడి చేశారు. వెకేషన్స్ వెళ్తూ సింగిల్ గా తీసుకుంటున్న పిక్స్ ను షేర్ చేస్తుంటారు. కానీ ఆ పిక్స్ లో బ్యాక్ గ్రౌండ్ ఒకటే ఉంటుంది. కాబట్టి విజయ్, రష్మిక రిలేషన్ లో ఉన్నారని వారు చెప్పకపోయినా అంతా ఫిక్స్ అయ్యారు.
రీసెంట్ గా కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ పై రష్మిక చేసిన కామెంట్ తర్వాత.. ఓపెన్ అవ్వండి మేడమ్.. గుడ్ న్యూస్ చెప్పేయండంటూ అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు మరోసారి ఇంకా ఎందుకు లేట్ అని అంటున్నారు. అందుకు కారణం.. ఇద్దరూ తాజాగా ఒకే కారులో పక్కపక్కన కూర్చొని ట్రావెల్ చేయడమే.
ముంబై ఎయిర్ పోర్ట్ లో రీసెంట్ గా ఇద్దరూ కలిసి కనిపించారు. ఆ తర్వాత ఒకే కారులో ప్రయాణించారు. దీంతో ఆ దృశ్యాలను ఫొటోగ్రార్లు క్లిక్‌మనిపించారు. ప్రస్తుతం ఆ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అఫీషియల్ గా రిలేషన్ అనౌన్స్ చేయండి సర్.. మేడమ్.. అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
కాగా వారిద్దరి సినిమాల విషయానికొస్తే.. ఇప్పుడు రష్మిక మరో రెండు రోజుల్లో కుబేర మూవీతో సందడి చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాలో లీడ్ రోల్ పోషించారు. జూన్ 20న థియేటర్స్ లో సందడి చేయనున్నారు. ఆ మూవీతోపాటు మరిన్ని సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు అమ్మడు.
మరోవైపు, విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ మూవీతో బిజీగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా త్వరలో విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. ఆ మూవీలో రష్మికనే హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది వేచి చూడాలి.
