విజయ్ - రష్మిక.. సొంత ఊరిలో సాంప్రదాయంగా మొదలైన కొత్త జీవితం..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 2 March 2026 1:21 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గీతాగోవిందం సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మొదలైంది. అలా ఎనిమిదేళ్లపాటు రహస్యంగా ప్రేమను కొనసాగించిన ఈ జంట.. ఎట్టకేలకు 2026 ఫిబ్రవరి 26న రెండు సాంప్రదాయాల పద్ధతుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఇకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అనంతరం శాస్త్రోత్తంగా జరిగే పనులను విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు మొదలుపెట్టారు. ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా తుమ్మన్ పేట గ్రామానికి చేరుకున్న నవ దంపతులు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న నూతన ఫామ్ హౌస్ లో గృహప్రవేశం చేసి, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించనున్నారు ఇప్పటికే తుమ్మన్ పేట లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌస్ ను అత్యంత సుందరంగా అలంకరించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులను గ్రామ ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న దంపతులు విజయ్ ఫామ్ హౌస్ లో సత్యనారాయణ వ్రతం పూర్తి చేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు.
ఇదిలా ఉండగా మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో ఈ జంట తమ వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు పలువురు సినీ సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారు. ఇప్పటికే ఈ నూతన జంట కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భారత ప్రధాని నరేంద్ర మోదీలను స్వయంగా కలిసి తమ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించారు.
అటు వివాహానికి ముందే విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా.. వివాహం అనంతరం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి రష్మిక మందన్న తమ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించింది.
ఇదిలా ఉండగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా అలాంటివారు రిసెప్షన్ కి రాకూడదు అంటూ ఒక నోట్ రిలీజ్ చేసింది ఈ జంట. ముఖ్యంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండలకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రిసెప్షన్ జరిగే హోటల్ పరిసరాలలో కఠినమైన ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. అధికారిక ఆహ్వానం లేని వారు రిసెప్షన్ ప్రాంగణానికి కూడా రావద్దని పోలీసులు స్పష్టం చేయగా.. అటు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కూడా పోలీసులు ఆంక్షలను గౌరవిస్తూ.. ఆహ్వానం లేకుండా ఎవరు రిసెప్షన్ కి రావద్దు అంటూ కోరింది. ఈ మేరకు ఈ జంట అభిమానులకు ఒక వినయపూర్వకమైన విజ్ఞప్తి కూడా చేసింది. అభిమానుల భద్రత, క్షేమం కొరకే ఈ ప్రకటన జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఏది ఏమైనా వివాహం తర్వాత ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
