Begin typing your search above and press return to search.

టాప్ హీరో రేస్‌లో భారీ ట్విస్ట్.. సూర్యపై నిర్మాత ఓపెన్ స్టేట్‌మెంట్!

విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లిన తర్వాత తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ రేస్‌పై కొత్త డిస్క‌ష‌న్ మొదలైంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Aug 2026 5:09 PM IST
టాప్ హీరో రేస్‌లో భారీ ట్విస్ట్.. సూర్యపై నిర్మాత ఓపెన్ స్టేట్‌మెంట్!
X

విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లిన తర్వాత తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ రేస్‌పై కొత్త డిస్క‌ష‌న్ మొదలైంది. హీరో సూర్యను ఉద్దేశిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆ డిబేట్‌ను మరింత వేడెక్కించాయి. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో టాప్ పొజిషన్‌లో వాక్యూమ్ ఏర్పడింద‌ని, ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి సూర్య చాలా ఎలిజిబుల్ పర్సన్ అని ఆయన విశ్వనాథ్ & సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కామెంట్ చేశారు.

ఆయ‌న మాట‌ల్లో మ‌రో అంశం కరుప్పు సినిమా స‌క్సెస్ ను సూర్య స్టార్ స్టేటస్‌తో ముడిపెట్టడం. రూ.50- 60 కోట్ల కలెక్షన్లు వస్తాయని భావించిన క‌రుప్పు సినిమా రూ.83 కోట్ల వరకు వెళ్లిందని, ప్రేక్షకులు సూర్యను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే సంకేతాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. దీంతో ఆయ‌న కామెంట్స్ కేవలం ప్రశంసలా? లేక సూర్యను తమిళ ఇండస్ట్రీలో నెక్స్ట్ నంబర్ వన్ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే అసలు ప్రశ్న మాత్రం ఇదే. విజయ్ తర్వాత నిజంగానే టాప్ స్టార్ వాక్యూమ్ ఉందా? తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ ఇప్పటికీ అతిపెద్ద మాస్ ఐకాన్. కమల్ హాసన్ తన ప్రత్యేక స్థానం, కంటెంట్ ఓరియెంటెడ్ మార్కెట్‌ను కంటిన్యూ చేస్తున్నారు. అజిత్‌కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్, భారీ ఓపెనింగ్స్ ఉన్నాయి. ధనుష్ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరిస్తున్నారు. శివకార్తికేయన్ ఇటీవల వరుస స‌క్సెస్‌ల‌తో కమర్షియల్ రేస్‌లో వేగంగా ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్క హీరో కోసం ఖాళీ అయిన ప్లేస్ అనే వాదన అంత సులభంగా అంగీకరించదగినది కాదు.

అయితే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత భారీ మాస్ మార్కెట్‌ను ఎవరు ఆక్రమిస్తారు? అనే ప్రశ్న మాత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సూర్యకు నటుడిగా ఉన్న విశ్వసనీయత, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్, పాన్ సౌత్ గుర్తింపు ఆయనకు స్ట్రెంగ్త్స్ గా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కమర్షియల్ బాక్సాఫీస్ పరంగా స్థిరమైన భారీ రేంజ్‌ను కొనసాగించడం ఆయన ముందున్న సవాలుగా ఉంది. అయితే తమిళ ఇండస్ట్రీలో టాప్ స్టార్ వాక్యూమ్ ఉందా లేదా అన్నదానికంటే, ఆ టాప్ రేస్ ఇప్పుడు మరింత ఓపెన్ అయిందనే అభిప్రాయం బలపడుతోంది. రాబోయే పెద్ద సినిమాల ఫలితాలే ఈ డిబేట్‌కు అసలు సమాధానం చెప్పనున్నాయి.