Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి అభిమానులు సూర్య‌కు మ‌ద్ద‌తుగా!

కోలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలతో పాటు కమర్షియల్ బాక్సాఫీస్‌ను కాపాడగల సత్తా సూర్యకు ఉందని భావించి ఆయన చిత్రాలకు పూర్తి మద్దతును ఇస్తున్నారు.

By:  Srikanth Kontham   |   19 May 2026 5:12 PM IST
ద‌ళ‌ప‌తి అభిమానులు సూర్య‌కు మ‌ద్ద‌తుగా!
X

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల అభిమానుల మధ్య ఉండే పోటీ- వారసత్వ పోరాటాలు ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. అయితే తాజాగా కోలీవుడ్ రాజకీయాలు - సినీ రంగంలో ఊహించని సరికొత్త మార్పు చోటు చేసుకుంది. దళపతి విజయ్ సినీ ప్రస్థానాన్ని ముగించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి విజయవంతంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఆయన కోట్ల మంది అభిమానులు వెండితెరపై మరో విలక్షణ స్టార్ హీరో సూర్య కు మద్దతు ఇస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ సరికొత్త సపోర్ట్ సూర్య నటించిన తాజా చిత్రం `కరుప్పు` బాక్సాఫీస్ ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తోంది.

భారీ అంచనాల మధ్య విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. దళపతి విజయ్ అభిమానులు థియేటర్ల వద్దకు క్యూ కట్టి సూర్య సినిమాకు అండగా నిలవడంతో `కరుప్పు` చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. విజయ్ పొలిటికల్ గ్యాప్‌ను సూర్య మార్కెట్ భర్తీ చేస్తుందనడానికి ఈ కలెక్షన్ల సునామీ పక్కా నిదర్శనంగా మారింది. అయితే విజయ్ అభిమానులు సూర్యకు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి `కరుప్పు` సినిమాను ఓన్ చేసుకోవడానికి వారి మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహబంధం మాత్రమే కారణం కాదు.

ఈ చిత్రంలో దళపతి విజయ్ కెరీర్‌కు ఆయన నిజ జీవిత రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన పలు ఆసక్తికర ఎలిమెంట్స్ , ప్రస్తావనలు ఉన్నాయంటూ ప్రేక్షకులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. విజయ్ సిద్ధాంతాలను, ఆయన పాపులర్ డైలాగులను సోషల్ మెసేజ్‌లను ప్రతిబింబించేలా డైరెక్టర్ సినిమాలో కొన్ని సీన్లను డిజైన్ చేశారని అవి విజయ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టు కుంటున్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా తమిళ పరిశ్రమలో విజయ్, అజిత్, సూర్య వంటి స్టార్ల మధ్య బాక్సాఫీస్ వార్స్ నడుస్తుంటాయి. కానీ విజయ్ సీఎం అయిన తర్వాత ఆయన అభిమాన సంఘాలు ఒక మెచ్యూర్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తోంది.

కోలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలతో పాటు కమర్షియల్ బాక్సాఫీస్‌ను కాపాడగల సత్తా సూర్యకు ఉందని భావించి ఆయన చిత్రాలకు పూర్తి మద్దతును ఇస్తున్నారు. సూర్య కూడా విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రజా సేవను పలు సందర్భాల్లో అభినందించడం వల్ల ఇరు హీరోల ఫ్యాన్స్ మధ్య బలమైన సత్సంబంధం ఏర్పడిందని చెప్పొచ్చు.ఒక స్టార్ హీరో ఇండస్ట్రీని వీడినప్పుడు ఆ క్రేజ్ మరో నటుడి ప్రాజెక్టుకు మైలేజ్‌గా మారడం ట్రేడ్ పరంగా సరికొత్త సమీకరణాలకు దారితీస్తోంది. సూర్య అద్భుతమైన నటనతో కరుప్పు పాత్రలో జీవించడమే కాకుండా అదనపు ఫ్యాన్ బేస్ సపోర్ట్‌తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైలురాయిని అందుకోవడానికి సిద్ధమయ్యారు. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా దళపతి అభిమానులు సూర్యకు అండగా నిలవడం అనేది కోలీవుడ్‌లో ఒక హెల్తీ ట్రెండ్‌ను సృష్టించింది.