Begin typing your search above and press return to search.

స్టార్ హీరో సినిమాలో ముగ్గురు బడా దర్శకులు

ఈ పాత్రల కోసం దర్శకుడు వినోద్.. సహచర డైరెక్టర్లను సంప్రదించగా హ్యాపీగా ఒప్పుకున్నారని సమాచారం.

By:  Tupaki Desk   |   23 Aug 2025 11:45 PM IST
స్టార్ హీరో సినిమాలో ముగ్గురు బడా దర్శకులు
X

తమిళ ఇండస్ట్రీ దళపతి విజయ్ సినీ కెరీర్ లో ఆఖరు సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ జన నాయగన్. ఈ సినిమానే విజయ్ సినీ కెరీర్ లో లాస్ట్ సినిమా అని ఇప్పటికే అనౌన్స్ చేశారు. హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ సినిమా నందమూరి బాలకృష్ణ హిట్ చిత్రం 'భగవంత్ కేసరి' కి రీమేక్ గా తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జన నాయగన్ సినిమాలో కోలీవుడ్ స్టార్ దర్శకులు లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ఈ దర్శకుడు న్యూస్ రిపోర్టర్లుగా కనిపిస్తారని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఈ పాత్రల కోసం దర్శకుడు వినోద్.. సహచర డైరెక్టర్లను సంప్రదించగా హ్యాపీగా ఒప్పుకున్నారని సమాచారం. దర్శకులు లోకేష్, అట్లీ, నెల్సన్ స్టార్ హీరో విజయ్ తో గొప్ప అనుబంధాన్ని పంచుకున్నారని తెలుస్తోంది. అలాగే, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా ఒక పాటలో కనిపించనున్నారట. ఇవన్నీ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ లాగా ఉంటుందని అంటున్నారు.

మరోవైపు, విజయ్ ఆఖరి చిత్రం కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్ ను సినిమాలో చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఈ సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించనున్నారు. అలాగే సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కీ రోల్ పోషిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, మమిత బైజు, ప్రియమణి, గౌతమ్ మీనన్ లాంటి స్టార్ కాస్ట్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. శాండల్ వుడ్ బ్యానర్ కేవీఎన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. 2026 జనవరి సంక్రాంతి కానుకగా జననాయగన్ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా తర్వాత హీరో విజయ్ పూర్తిగా రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇటీవల ఆయన తమిళనాడులో తమిళగ వెట్రి కళగం అనే పార్టీ స్థాపించారు. ఆయన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా తర్వాత ఆయన పూర్తిగా పాలిటిక్స్ కు టైమ్ ఇవ్వనున్నారు.