Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ చివరి మూవీ క్రేజీ అప్‌డేట్‌

తమిళ్ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా ప్రస్తుతం హెచ్ వినోద్‌ దర్శకత్వంలో జన నాయగన్‌ అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   6 May 2025 6:10 PM IST
Vijay Bids Farewell to Films with Political Drama Jananayagan
X

తమిళ్ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా ప్రస్తుతం హెచ్ వినోద్‌ దర్శకత్వంలో జన నాయగన్‌ అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. విజయ్ ఇప్పటికే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కారణంగా జన నాయగన్‌ సినిమా చివరి సినిమా అంటూ ప్రకటన వచ్చింది. విజయ్ నుంచి కూడా ఇదే తన చివరి సినిమా అనే ప్రకటన వచ్చింది. అందుకే అభిమానులు సినిమాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయం వారికి చాలా ఆసక్తిని కలిగిస్తుంది. విజయ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమా కాస్త ఆలస్యం అవుతుంది. ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సిన విజయ్‌ చివరి సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు గా అధికారిక ప్రకటన వచ్చింది.

విజయ్‌ 69వ సినిమాగా రూపొందుతున్న జన నాయగన్‌ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్ రివీల్‌ అయింది. సినిమాలో విజయ్ పవర్‌ ఫుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్‌ పేరు తలపతి వెట్రి కొందన్‌గా తెలుస్తోంది. సాధారణంగా విజయ్ నటించిన ప్రతి సినిమాలోనూ హీరో పాత్ర పేరు చాలా విభిన్నంగా ఉండే విధంగా ప్లాన్‌ చేస్తారు. ఇది చివరి సినిమా కావడంతో మరింత ఎక్కువ శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే విజయ్ రాజకీయ పార్టీ పేరు కలిసే విధంగా తలపతి వెట్రి కొందన్‌ ను పెట్టారు. ఆ పేరును షార్ట్‌ ఫామ్‌లో రాస్తే టీవీకే అని వస్తుంది. టీవీకే అంటే ఏంటి అనేది అందరికీ తెలిసిందే. విజయ్‌ యొక్క రాజకీయ పార్టీ పేరు టీవీకే అని తెలిసిందే.

తన పార్టీ పేరు వచ్చే విధంగా సినిమాలో పాత్ర పేరును పెట్టడం అనేది కాకతాళీయంగా జరిగిందా లేదంటే కావాలని పెట్టారా అనే చర్చ మొదలైంది. సినిమాలో విజయ్‌ చేతిపై కూడా అదే రాసి ఉంటుంది. కనుక తన రాజకీయ పార్టీకి మరింత పబ్లిసిటీ దక్కినట్లు అవుతుందని విజయ్ భావిస్తున్నాడేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికలకు దగ్గర ఉండే విధంగా సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ఎన్నికల్లో సినిమా కచ్చితంగా కొంత మేరకు అయినా ప్రభావం చూపిస్తుంది అనే అభిప్రాయంను సినీ, రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జన నాయగన్‌ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌ స్టైలిష్ విలన్‌ బాబీ డియోల్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను అదే టైటిల్‌తో తెలుగులోనూ విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్‌ కళ్యాణ్ రాజకీయాల్లో ఎలా అయితే సక్సెస్‌ అయ్యాడో అలాగే విజయ్ కూడా రాజకీయాల్లో సక్సెస్‌ అయ్యి కీలక పదవిని దక్కించుకుంటాడు అంటూ తమిళ సినీ అభిమానులు, ముఖ్యంగా విజయ్ అభిమానులు మాట్లాడుతున్నారు. వచ్చే ఏడాదిలో విజయ్ రాజకీయ భవితవ్యం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.