దళపతి వల్ల వంద కోట్లు కోల్పోయారా?
రిలీజ్ వాయిదాపడి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ రిలీజ్‌పై టీమ్‌కు ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
By: Tupaki Entertainment Desk | 3 Feb 2026 3:22 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి మూవీ `జన నాయగన్` రిలీజ్ చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా దీన్ని రీమేక్ చేశారు. ట్రైలర్ రిలీజ్ వరకు ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన మేకర్స్ దానిపై స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. ఇది రీమేక్ కాదని చెప్పకుండా ఇది విజయ్ సినిమా అంటూ సమాధానం చెప్పడం, ట్రైలర్ రిలీజ్ తరువాత అంతా అనుమానించినట్టే ఇది `భగవంత్ కేసరి` రీమేక్ అని తేలడంతో అంతా అవాక్కయ్యారు.
అయితే మెయిన్ స్టోరీని తీసుకున్నాకానీ దానికి సెకండ్ హాఫ్‌ని మార్చి..రోబోటిక్ అంశాన్ని జోడించారు. విలన్ క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్‌లని కూడా దాదాపుగా మార్చేసినట్టుగా ట్రైలర్‌లోని సీన్‌లని చూస్తూ స్పష్టమైంది. ఇదిలా ఉంటే ఈ మూవీని ముందు జనవరి 9న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశిస్తూ సినిమాలకు గుడ్ బై చెబుతుండగంతో ఆయన చివరి సినిమాగా `జన నాయగన్`ని భారీ లెవెల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే సడన్‌గా సెన్సార్ టీమ్ షాక్ ఇవ్వడంతో మూవీ రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.
రిలీజ్ వాయిదాపడి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ రిలీజ్‌పై టీమ్‌కు ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. సీబీఎఫ్‌సీ ఈ మూవీ రిలీజ్‌కు షరతులు విధించడం, పలు కట్స్ సజెస్ చేయడంతో దానికి టీమ్ అంగీకరించడం లేదు. అయితే రివిజన్ కమటీకి వెళ్లమని కూడా చెప్పకుండా సీబీఎఫ్‌సీ వర్గాలు కొన్ని రోజులుగా మౌనం పాటిస్తుండటంతో `జన నాయగన్` రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా అని ఓ వర్గం వాదిస్తుంటే మరో వర్గం మాత్రం మేకర్స్ మెట్టు దిగుతున్నారని, సినిమా రిలీజ్ త్వరలోనే ఉంటుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన చర్చ తమిళనాట వినిపిస్తోంది. `జన నాయగన్` రిలీజ్ డిలే కారణంగా కోలీవుడ్ ఇండస్ట్రీ రూ.100 కోట్లు నష్టపోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అనుకున్న టైమ్‌కు సినిమా విడుదలైతే ఒక్క తమిళనాడులోనే రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు రాబట్టేదట. శివ కార్తికేయన్ `పరాశక్తి` తమిళనాడు అంతటా రూ.50 కోట్లు రాబట్టింది. కార్తి నటించిన `అన్నగారు వస్తారు` పొంగల్‌కె విడుదలైనా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది.
అయితే జీవా నటించిన `తలైవర్ తంబి తలైమయిల్` తమిళనాట రూ.30 కోట్లు రాబట్టింది. పరాశక్తి, `తలైవర్ తంబి తలైమయిల్` రిలీజ్ తరువాతే కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.85 కోట్లకు మించి వసూళ్లు నమోదయ్యాయట. అదే వీటికి తోడు విజయ్ `జన నాయగన్` రిలీజ్ అయ్యుంటే ఆ ఫిగర్ డబుల్ అయ్యేదని అక్కడ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అంతే కాకుండా ఆ వేరియషన్‌ని గమనిస్తే కోలీవుడ్ బాక్సాఫీస్ దాదాపు రూ.100 కోట్లు నష్టపోయిందని, ఇది పొంగల్ బాక్సాఫీస్ కు భారీ దెబ్బ అని వాపోతున్నారు.
