దళపతి విజయ్ చివరి సినిమా `జన నాయగన్ కాదా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ `జన నాయగన్`.
By: Tupaki Desk | 25 April 2025 8:30 AM ISTతమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ `జన నాయగన్`. దర్శకుడు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో భారీ నిర్మాణ సంస్థగా పేరున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్‌రాజ్, ప్రియమణి, శృతిహాసన్ , ప్రేమలు` ఫేమ్ మమితా బైజు, రెబా మోనిక, వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ బిజినెస్ పరంగా ఇప్పటికే రికార్డులు సృష్టిస్తూ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ఈ మూవీ విజయ్ నటిస్తున్న చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఏకంగా రిలీజ్‌కు ముందే ఈ సినిమా బిజినెస్ రూ.175 వరకుజరిగినట్టుగా తెలిసింది. స్ట్రీమింగ్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు దక్కించుకోగా ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌కి రూ.55 కోట్లు దక్కినట్టుగా ఇన్ సైడ్ టాక్.
ఇదిలా ఉంటే విజయ్ నటిస్తున్న ఈ క్రేజీ మూవీని వచ్చే డాది జనవరి 9న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ విజయ్ చివరి సినిమా అని ప్రచారం జరుగుతండటంతో సినిమా బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది విజయ్ చివరి సినిమా కాదని, దీని తరువాత విజయ్ మరో సినిమా కూడా చేయబోతున్నాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.
సూర్యతో `రెట్రో` మూవీని రూపొందించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా ప్రమోసన్స్‌లో పాల్గొంటూ విజయ్ సినిమాపై ఆసక్తికంగా స్పందించారు. `జన నాయగన్` ప్లేస్‌లో విజయ్‌తో తన సినిమానే రావాల్సిందని చెప్పారు. `జగర్తాండ` తరువాత విజయ్‌తో సినిమా చేయాలని ఆయనని కలిశాను. ఎన్నో కథలు వినిపించాను. అయితే బ్యాడ్ లక్ నేను చెప్పిన కథలు ఆయనకు నచ్చలేదు. దాంతో ఆ అవకాశం కాస్త హెచ్ వినోద్‌కు వెళ్లింది. అలా `జన నాయగన్` పట్టాలెక్కింది అని తెలిపారు. రానున్న రోజుల్లో మంచి కథతో వస్తే కార్తీక్ సుబ్బరాజ్‌కు విజయ్ అవకాశం ఇస్తాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఆ మ్యాజిక్ జరిగి అదే విజయ్ చివరి సినిమా అవుతుందా? అన్నది తెలియాలంటే మరి `జన నాయగన్` విడుదల వరకు వేచి చూడాల్సిందే.
