'జన నాయగన్' వివాదం కోరి తెచ్చుకున్నదేనా?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన భారీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ `జన నాయగన్`.
By: Ravindar Gorantla | 17 March 2026 5:45 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన భారీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ `జన నాయగన్`. హెచ్ వినోద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా రిమేక్ చేశారు. అయితే తెలుగు కథని యాజిటీజ్‌గా తీసుకోకుండా సెకండ్ హాఫ్, విలన్ నేపథ్యం సమూలంగా మార్చేసి సరకొత్త కథతో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ తొలి సారి తమిళంలో అడుగుపెడుతూ నిర్మించిన సినిమా ఇది. ముందు జనవరి 9న పొంగల్ సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
అయితే సెన్సార్ వివాదం తలెత్తడం, సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలపై సీబీఎఫ్‌సీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సినిమా రిలీజ్ అర్థాంతరంగా నిలిచిపోయింది. పొంగల్ బరిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కావాల్సిన `జన నాయగన్` సెన్సార్ వివాదం కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత మేకర్స్ చెన్నై సింగిల్ బెంచ్‌ని ఆశ్రయించి సీబీఎఫ్‌సీపై కంప్లైంట్ రైజ్ చేశారు. దీంతో ఇష్యూ కోర్టు పరిధిలోకి వెళ్లిపోయింది. ఆ తరువాత ఎంత వరకు వెళ్లిందంటే సినిమా రిలీజ్ విషయంలో మేము ఏమీ చేయలేని స్థితిలోకి వచ్చేశాం అని మేకర్స్ ప్రకటించే వరకు వెళ్లింది.
ఆ తరువాత కోర్టు కేసుని విత్‌డ్రా చేసుకున్న మేకర్స్ సీబీఎఫ్‌సీ విధించిన కట్స్, సూచించిన మార్పులు చేర్పులు పూర్తి చేసి రివైజింగ్ కమిటీకి పంపించింది. దీనిపై ఇంత వరకు ఓ నిర్ణయాన్ని ప్రకటించలేదు సీబీఎప్‌సీ వర్గాలు. త్వరలోనే రివైజింగ్ కమిటీ ఈ మూవీని పరీక్షించి ఫైనల్‌గా ఓకే చెప్పేసి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తే సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది. అయితే ఇంత వరకు దీనికి సంబంధించిన కదలిక కనిపిచడం లేదు. ఒక వేళ సెన్సార్ వారు స్పందించి సర్టిఫికెట్ జారీ చేసినా సినిమా రిలీజ్ కావడం కష్టం.
ఎందుకంటే తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ కథాంశంతో రూపొదిని `జన నాయగన్`ని రిలీజ్ చేసే అవకాశం లేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిన పరిస్థితుల్లో సెన్సార్ వారు సర్టిఫికెట్ ఇచ్చేసినా ఉన్నపలంగా రిలీజ్ చేయడానికి లేదు. దీంతో టీమ్ ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని. అది కూడా ఏప్రిల్‌లో ఎన్నికలు పూర్తవ్వగానే సినిమాని నెలాఖరున అంటూ 24న కానీ 30న కానీ రిఈజ్ చేయాలని ప్లాన్ చేసినట్గుగా తెలిసింది.
ఈ సినిమా సెన్సార్ వివాదం కారణంగా ఆలస్యం కావడం స్వయంకృతమేనని ఇండైరెక్ట్‌గా పవన్ కల్యాణ్ ఇటీవల స్పష్టం చేయడం గమనార్హం. `ఓజీ` టైమ్‌లో నా సినిమా కూడా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొందని, అయినా అన్ని సమస్యల్ని అధిగమించి థియేటర్లలోకి వచ్చేసిందన్నారు. `జన నాయగన్` టీమ్ సెన్సార్ సమస్యని సరిగా డీల్ చేసుకోలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం `జన నాయగన్` రివైజింగ్ కమిటీ ముందుకొస్తుందని వార్తలు షికారు చేశాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. తమిళనాడు ఎన్నికలు ముగిసే వరకు ఈ సినిమా పరిస్థితి ఇంతేననే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
