విజయ్ క్రేజ్:దళపతి కోసం ఎయర్ బస్ ఫుల్!
దళపతి విజయ్‌కున్న క్రేజ్ గురించిప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రికార్డు స్థాయి క్రేజ్ విజయ్ సొంతం.
By: Tupaki Desk | 26 Dec 2025 2:04 PM ISTదళపతి విజయ్‌కున్న క్రేజ్ గురించిప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రికార్డు స్థాయి క్రేజ్ విజయ్ సొంతం. దానికి నిదర్శనంగా తాజాగా ఓ సంఘటన నిలిచింది. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ `జన నాయగన్`. హెచ్. వినోద్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే, `ప్రేమలు` ఫేమ్ మమితా బైజు, రెబామోనిక, ప్రియమణి కీలక పాత్రలలో నటిస్తున్నారు. యానిమల్ స్టార్ బాబి డియోల్ పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో చేస్తున్న చివరి సినిమా కావడంతో `జన నాయగన్`పై అభిమానుల్లో, సినీ లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సినిమాని తెరపైకి తీసుకొచ్చారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. జనవరి 9న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఆడియో లాంచ్‌ని మలేసియాలోని కౌలాలంపూర్‌లో డిసెంబర్ 27న భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.
ఆడియో లాంచ్‌లో రాజకీయ కార్యకలాపాలకు పాల్పడవద్దని ఇప్పటికే పోలీసులు హెఛ్చరించిన నేపథ్యంలో ఈ ఈవెంట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. కౌలాలంపూర్‌లో బుకిట్ జలీల్ స్టేడియంలో జరగనున్న ఈ భారీ వేడుకలో దాదాపు 90వేల మంది విజయ్ అభిమానులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు మొదలు కావడంతో ఈ ఈవెంట్‌లో పాల్గొనడం కోసం విజయ్ అభిమానులు భారీ స్థాయిలో కౌలాలంపూర్‌కు తరలి వెళుతున్నారు.
ఆడియో లాంచ్‌లో సినిమాలకు గుడ్ బై చెబుతున్న విషయంతో పాటు అభిమానులని ఉద్దశించి విజయ్ ఏమైనా వ్యాఖ్యలు చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు కౌలాలంపూర్ వెళుతున్నారు. జన నాయగన్ ఆడియో లాంచ్ కోసం చెన్నైనుంచి కౌలాలంపూర్ వెళుతున్న ఎయిర్ బస్ A320 విమానం మొత్తం దళపతి అభిమానులతో నిండిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి పలువురిని షాక్‌కు గురి చేస్తోంది.
ఒక హీరో కోసం అందులో విదేశంలో జరుగుతున్న ఆడియో ఫంక్షన్ కోసం అభిమానులు రికార్డు స్థాయిలో ఫ్లైట్ టికెట్‌లు బుక్ చేసుకుని వెళ్లడం ఇండియన్ సినీ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు. ఇంత క్రేజ్ ఏ హీరోకు చూడలేదని, విజయ్ అభిమానుల్ని ఆ స్థాయిలో ప్రభావితం చేశాడని కోలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. విజయ్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో `జన నాయగన్` ఆయన చివరి సినిమా కానుందని ప్రచారం జరుగుతోంది. దఈ ప్రచారాన్ని నిజం చేస్తూ విజయ్ సినిమాలకు గుడ్ బై చెబుతాడా? లేక పవన్ కల్యాణ్ తరహాలో సినిమాల్లో కంటిన్యూ అవుతాడా? అన్నది మరి కొన్ని గంటల్లో తేలబోతోంది.
