దళపతి వదల బొమ్మాళీ అంటున్నాడే!
తమిళ స్టార్ హీరో విజయ్ `ది గోట్`తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా వసూళ్ల పరంగానూ రికార్డు సృష్టించడం తెలిసిందే.
By: Tupaki Desk | 14 April 2025 12:57 PM ISTతమిళ స్టార్ హీరో విజయ్ `ది గోట్`తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా వసూళ్ల పరంగానూ రికార్డు సృష్టించడం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ విజయ్ స్టార్ డమ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లమేర వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
ఈ మూవీ తరువాత హీరో విజయ్ సొంతంగా తమిళగ వెట్టి కలగం` పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ రాజకీయాల్లో తన రాజకీయ అరంగేట్రంతో సరికొత్త చర్చకు తెరతీయడం, పార్టీ పరంగా తన స్టాండ్ ఏంటన్నది తొలి మీటింగ్‌లోనే స్పష్టం చేసి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాలకు తాను వ్యతిరేకం అంటూ క్లియర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో కేంద్ర స్థాయిలోనే విజయ్‌పార్టీపై చర్చ మొదలైంది. అప్పటి నుంచి అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్రంపై విజయ్ విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు.
ఇటీవల హిందీ ఇంపోజిషన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించిన విజయ్ తాజాగా మరో అడుగు ముందేశారు. ఇటీవల కేంద్రం వక్ఫ్‌బోర్డ్‌ని సవరిస్తూ తాజాగా ప్రత్యేక బిల్లును తీసుకురావడం తెలిసిందే. దేశంలో వక్ఫ్‌బోర్డ్ పేరుతో భూములు, వ్యక్తిగత ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని, అంతే కాకుండా వక్ఫ్‌బోర్డ్‌ని ఏ ఉద్దేశంతో ప్రారంభించారో ది నెరవేరడం లేదని, పేద ముస్లీంలకు న్యాయం జరగడం లేదని వాదించిన కేంద్ర వివాదాస్పద వక్ఫ్ బోర్డ్‌లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ కొత్త చట్టాన్ని చేసింది.
దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ బిల్లుపై తమిళ స్టార్ హీరో, పొలిటికల్ లీడర్ విజయ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లుని వ్యతినేకిస్తూ ఆయన సుప్రీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ చట్టం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, దీనిని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టాన్ని వ్యతికేకిస్తూ ఇప్పటి వరకు సుప్రీమ్ కోర్ట్‌లో 10 వరకు కేసులు నమోదయ్యాయి. అందులో విజయ్ పిటీషన్ కూడా ఉండటం గమనార్హం.
ఇదిలా ఉంటే హీరో విజయ్ ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో `జననాయగన్` మూవీ చేస్తుఎన్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే బిజినెస్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్, `ప్రేమలు` ఫేమ్ మమితా బైజు, ప్రియమణి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా నటిస్తున్నారు. కీలకమైన విలన్ క్యారెక్టర్‌లో బాబిడియోల్ కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానుంది.
