Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ రూట్లోనే దేవరకొండ.. వాళ్ళను నమ్మొచ్చా?

టాలీవుడ్ యంగ్ అండ్ డాషింగ్ హీరోలలో విజయ్ దేవరకొండ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఫ్లాప్స్ ఎన్ని ఎదురైనా కూడా అతనికి ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు.

By:  Tupaki Desk   |   12 July 2025 3:00 PM IST
ఎన్టీఆర్ రూట్లోనే దేవరకొండ.. వాళ్ళను నమ్మొచ్చా?
X

టాలీవుడ్ యంగ్ అండ్ డాషింగ్ హీరోలలో విజయ్ దేవరకొండ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఫ్లాప్స్ ఎన్ని ఎదురైనా కూడా అతనికి ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు. ఇక ప్రస్తుతం తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్ డమ్’ సినిమా చేస్తున్న విజయ్.. ఇకపైనా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రాజెక్టులు సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రౌడి జనార్దన్ తో పాటు రాహుల్ సంకృత్యాన్ తో ఒక సినిమా లైన్ లో ఉంది.

ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు చూస్తే దేవరకొండ ఒక హిందీ బిగ్ బడ్జెట్ చిత్రంలో విలన్‌గా నటించనున్నాడని సమాచారం. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు, ‘డాన్ 3’. ఇప్పటికే ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మొదట విలన్‌గా విక్రాంత్ మస్సే ఫిక్స్ అయినట్టు టాక్ వినిపించినా, తాజా సమాచారం ప్రకారం ఆ ఛాన్స్ ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతికి వచ్చినట్లు బాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

లండన్‌లో ప్రస్తుతం ఫర్హాన్ అఖ్తర్ లొకేషన్ రిక్కీ చేస్తున్నాడట. ఇదే సమయంలో విజయ్ పేరు చర్చల్లోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ విజయ్ టీం నుంచి అధికారిక సమాచారం రాకపోయినా, ఇదే నిజమైతే ఇది విజయ్ కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. విలన్ పాత్రలో దేవరకొండ కనిపించాలంటే.. అది సాధారణంగా ఉండదు. ముఖ్యంగా రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోకి టఫ్ కాన్‌ట్రాస్ట్‌గా ఉండే విధంగా పాత్ర ఉండటం ఖాయం.

ఇప్పటివరకు మాస్ అండ్ లవర్ బాయ్ ఇమేజ్‌తో ఉన్న విజయ్‌కు ఇది కంప్లీట్ షేడ్స్ మారే ఛాన్స్ కావొచ్చు. ఇదిలా ఉంటే బాలీవుడ్‌ వైపు వెళ్లే టాలీవుడ్ స్టార్స్‌ని చూస్తే.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ‘వార్ 2’లో ఓ పవర్‌ఫుల్ పాత్ర చేస్తున్నాడు. అయితే, ఆ సినిమా నుంచి వచ్చిన టీజర్ పెద్దగా అంచనాలను అందుకోలేకపోయింది. ఎన్టీఆర్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఆశించినంత స్థాయిలో హైప్ ఫీలవ్వలేదు. ఇది చూస్తుంటే బాలీవుడ్ మేకర్స్ ట్రీట్‌మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండేలా ఉంది.

ఇప్పుడు అదే తరహాలో విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్‌లో క్రేజీ విలన్ పాత్ర చేస్తే.. డిజైన్, స్క్రీన్ స్పేస్, ఇంపాక్ట్ అన్నింటిలోనూ ఆయనను మిలీమెటర్ కూడా తగ్గకుండా చూపించాల్సిన బాధ్యత బాలీవుడ్ మేకర్స్ మీద ఉంటుంది. టాలెంట్ ఉన్నా, కంటెంట్ లేకుండా చూపిస్తే అది క్రేజ్ తగ్గించే ప్రమాదం ఉంటుంది. ఏదేమైనా, దేవరకొండ రూట్ ఇప్పుడు ఎన్టీఆర్ లైన్‌లోకి మళ్లినట్టే. విలన్ పాత్ర అయినా సరే, పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు రావడానికి ఇది బలమైన వేదిక అవొచ్చు. కానీ బాలీవుడ్ మేకర్స్‌పై పూర్తిగా ఆధారపడకుండా, టీమ్ లెవెల్‌ నుంచి కంట్రోల్ తీసుకునే విధంగా ప్లాన్ చేస్తేనే విజయ్‌కి ఇది గేమ్ చేంజర్ అవుతుంది.