Begin typing your search above and press return to search.

VD14: పోస్టర్ తోనే కిక్కిచ్చారుగా..

విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు VD14 మేకర్స్ మంచి కిక్కిచ్చారు.

By:  Tupaki Desk   |   9 May 2025 4:29 PM IST
VD14: పోస్టర్ తోనే కిక్కిచ్చారుగా..
X

విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు VD14 మేకర్స్ మంచి కిక్కిచ్చారు. అతని కొత్త సినిమాకు సంబంధించి టీమ్ ఈ రోజు ఓ స్టన్నింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో “దేవుళ్లు అతనికి శక్తినిచ్చారు, యుద్ధం అతనికి లక్ష్యాన్నిచ్చింది” అనే ట్యాగ్‌లైన్‌తో విజయ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు. రాహుల్ సంకృత్యాయన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.


‘వీడీ14’ పోస్టర్ తోనే అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ చూస్తుంటే రణరంగంలో ఓ యోధుడిలా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను సూచిస్తోంది. “దేవుళ్లు అతనికి శక్తినిచ్చారు, యుద్ధం అతనికి లక్ష్యాన్నిచ్చింది” అనే ట్యాగ్‌లైన్ సినిమా కథాంశంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, VD14 ట్రెండ్‌గా మారింది.

సినిమా టీమ్ విజయ్ దేవరకొండకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. రాహుల్ సంకృత్యాయన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భూషణ్ కుమార్, కృషన్ కుమార్, శివ్ చానన, నీరజ్ కల్యాణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం ఓ కొత్త లుక్‌లో సిద్ధమవుతున్నాడు. సినిమాలో అతను ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నాడని, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో అభిమానులను ఆకట్టుకుంటాడని టాక్. విజయ్ గత సినిమాలైన ‘ఫ్యామిలీ స్టార్’, ‘ఖుషి’ మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను సాధించాయి, కానీ ‘వీడీ14’తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయాలని అతను భావిస్తున్నాడు. ఈ సినిమా 2026 సమ్మర్‌లో రిలీజ్ కానుందని అంటున్నారు.

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ బర్త్‌డే సెలబ్రేషన్స్, ‘వీడీ14’ పోస్టర్‌తో సందడి చేస్తున్నాయి. ఇక రౌడి స్టార్ ట్యాగ్‌తో అభిమానులు విషెస్ వెల్లువెత్తిస్తున్నారు. ఈ సినిమా కోసం అతను ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడని, రాహుల్ సంకృత్యాయన్ అతని ఎనర్జీని సరైన విధంగా వాడుకునేలా స్క్రిప్ట్ రెడీ చేశాడని సమాచారం. మొత్తంగా, ‘వీడీ14’ పోస్టర్, ట్యాగ్‌లైన్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి.