Begin typing your search above and press return to search.

VD14 షాకింగ్ బడ్జెట్..?

విజయ్ దేవరకొండ కింగ్ డం తర్వాత రెండు భారీ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి రవికిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తుంది.

By:  Tupaki Desk   |   4 Jun 2025 4:00 AM IST
VD14 షాకింగ్ బడ్జెట్..?
X

విజయ్ దేవరకొండ కింగ్ డం తర్వాత రెండు భారీ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి రవికిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రౌడీ జనార్ధన్ అంటూ విజయ్ దేవరకొండ 13వ సినిమా వస్తుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుందని చెబుతున్నారు.

ఇక ఈ మూవీ తర్వాత రాహుల్ సంకృత్యన్ తో విజయ్ దేవరకొండ భారీ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ సబ్జెక్ట్ తో రాబోతుందని తెలుస్తుంది. ఈమధ్యనే విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ ని వదిలారు మేకర్స్. ఈ సినిమా హిస్టరీ బేస్డ్ మూవీగా ఉంటుందని తెలుస్తుంది. వీడీ 14 సినిమాకు షాకింగ్ బడ్జెట్ పెట్టేస్తున్నారని తెలుస్తుంది.

సినిమాను 200 కోట్ల నుంచి 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని టాక్. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా బాలీవుడ్ లో వచ్చిన ఛావా తరహాలో ఈ సినిమా ఉండబోతుందని టాక్. విజయ్ దేవరకొండ తో పాటు ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది. ఇద్దరి హిట్ పెయిర్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.

విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ ఆల్రెడీ టాక్సీవాలా సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబో సెట్ అయ్యింది. విజయ్ కింగ్ డం కూడా భారీ హైప్ తో వస్తుంది. ఆ తర్వాత రౌడీ జనార్ధన్ ఇక ఆ నెక్స్ట్ రాహుల్ మూవీ సో వీడీ ప్లానింగ్ ఫ్యాన్స్ కి సూపర్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. వీడీ 14 సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సినిమాను నెక్స్ట్ ఇయర్ లేదా 2027 రిలీజ్ ప్లానింగ్ తో వస్తున్నారని టాక్.

కెరీర్ మొదట్లోనే తన స్టార్ కపాసిటీ ప్రూవ్ చేసుకుని రౌడీ ఇమేజ్ తో ఫ్యాన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ సూపర్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఐతే రాబోతున్న సినిమాలు మాత్రం అతన్ని మళ్లీ టాప్ లీగ్ లో ఉండేలా చేస్తాయని అంటున్నారు. వీడె 12, 13, 14 ఒకదానికి మించి మరొకటి అనేలా భారీ హైప్ తో వస్తున్నాయి. మరి ఈ సినిమాల ఫలితాలు రౌడీ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తాయా లేదా అన్నది చూడాలి.