బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ తో మరోసారి.. దేవరకొండ కొత్త మూవీ ఫిక్స్!
అదే సమయంలో ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 5 May 2025 1:13 PMటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన.. త్వరలో కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ మే30న రిలీజ్ కానుంది.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. విజయ్ కమ్ బ్యాక్ ఇస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి సాలిడ్ హిట్ అందిస్తారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తన డెబ్యూ మూవీ పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో మరోసారి వర్క్ చేయనున్నట్లు సమాచారం. నిజానికి.. కొన్ని రోజులుగా వారి కాంబో రిపీట్ అవ్వనుందని సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఇప్పుడు రంగం సిద్ధమైందని.. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని టాక్.
విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో రానున్న మూవీని ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ నిర్మించనుందని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ లో వర్క్స్ స్టార్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే గీతా ఆర్ట్స్ తో ఇప్పటికే విజయ్.. గీతా గోవిందం సినిమాకు గాను వర్క్ చేసిన విషయం తెలిసిందే.
2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఎలాంటి హిట్ అయిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆ మూవీ ఎవర్ గ్రీనే. ఇప్పుడు మరోసారి గీతా ఆర్ట్స్ తో విజయ్ వర్క్ చేయనున్నారని సమాచారం. మూవీ పేరు బినామీ అని ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు.
ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో మూవీ ఫిక్స్ అయినట్లు ఉందని కామెంట్లు పెడుతున్నారు. వెయిటింగ్ ఫర్ అప్డేట్స్ అంటూ సందడి చేస్తున్నారు. అయితే విజయ్ చేతిలో కింగ్ డమ్ కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చెరో మూవీ చేయనున్నారు విజయ్. దీంతో తరుణ్ భాస్కర్ తో మూవీ సెట్స్‌పైకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందనే చెప్పాలి.