సూర్య వాయిస్ ఓవర్ పై విజయ్ కామెంట్స్..!
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచాడు. రిలీజ్ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది.
By: Ramesh Boddu | 29 July 2025 4:49 PM ISTవిజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచాడు. రిలీజ్ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ టైం లో విజయ్ దేవరకొండ సాధ్యమైనంత వరకు ప్రమోట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా నేడు కింగ్ డమ్ తమిళ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు విజయ్. అక్కడ కింగ్ డమ్ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ సూర్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు విజయ్ దేవరకొండ.
సూర్ పవర్ ఫుల్ వాయిస్..
కింగ్ డమ్ టీజర్ కి వాయిస్ ఓవర్ కావాలని అన్నప్పుడు తెలుగులో ఎన్టీఆర్ అన్న చేశాడు. తమిళ్ లో ఒక పవర్ ఫుల్ వాయిస్ కావాలంటే గౌతం సూర్య అన్న పేరు చెప్పాడు. ఆ టైం లో తాను సూర్య అన్నకి కాల్ చేసి గౌతం తిన్ననూరి సినిమా టీజర్ గురించి చెప్పి అతనికి నో చెప్పమని చెప్పా.. కానీ సూర్య అన్న అదేం లేదు వాయిస్ ఓవర్ ఇస్తానని చెప్పి సపోర్ట్ చేశారు. కింగ్ డం తమిళ్ టీజర్ కి సూర్య అన్న పవర్ ఫుల్ వాయిస్ చాలా ప్లస్ అయ్యిందని అన్నాడు విజయ్ దేవరకొండ.
కాస్త బ్యాక్ కి వెళ్తే సూర్య రెట్రో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ వచ్చాడు. ఆ టైం లో సూర్య తనకు ఇచ్చే సపోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు విజయ్. కింగ్ డమ్ సినిమా టీజర్ కి తెలుగులో తారక్, తమిళ్ లో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ టీజర్ ఇంపాక్ట్ తోనే కింగ్ డమ్ పై అంచనాలు పెరిగాయి.
విజయ్ ఒక సాలిడ్ హిట్ కొట్టాలని..
కింగ్ డమ్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా మీద విజయ్ దేవరకొండ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమాతో విజయ్ ఒక మంచి సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఐతే కింగ్ డమ్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే మంచి స్టఫ్ ఉన్న సినిమాగానే అనిపిస్తుంది. మరి కింగ్ డం విజయ్ కోరిక నెరవేరుస్తుందా లేదా అన్నది చూడాలి.
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాలో భాగ్య శ్రీ హీరోయిన్ గా చేసింది. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ ఇంకా బిజిఎం మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేయనున్నాయి.
