Begin typing your search above and press return to search.

విజయ్ రౌడీ జనార్దన్.. ఈ స్పీడ్ లో సాధ్యమేనా?

రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ప్రాజెక్టుకు 'రౌడీ జనార్దన్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు ఇటీవల నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు.

By:  Tupaki Desk   |   11 April 2025 3:32 PM IST
విజయ్ రౌడీ జనార్దన్.. ఈ స్పీడ్ లో సాధ్యమేనా?
X

విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ‘కింగ్ డమ్’ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇది ఇప్పటికే చివరి దశ పనుల్లో ఉంది. మే 30న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. మరోవైపు రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో ఒక పాన్ ఇండియా సినిమా కూడా విజయ్ లైన్ లో పెట్టాడు. దీంతో విజయ్ డిఫరెంట్ ట్రాక్ లో ఫోకస్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

అయితే తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ కూడా విజయ్ ఖాతాలో చేరింది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ప్రాజెక్టుకు 'రౌడీ జనార్దన్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు ఇటీవల నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుంది. ఇందులో విజయ్ కు జోడీగా కీర్తి సురేశ్ నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ ఫ్రెష్ గా ఉండబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఇందులో హైలైట్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ రవికిరణ్ కోలా ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశను పూర్తిగా ర్యాప్ చేసేశాడు. జూన్ నుండి షూటింగ్ ప్రారంభించి, అక్టోబర్ లోపే షూటింగ్ పనులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. నాలుగు నెలల్లోనే పూర్తిగా షూట్ కంప్లీట్ చేసి, డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలన్నదే మేకర్స్ టార్గెట్. అంటే, విజయ్ ప్రస్తుతం చేసే సినిమాలన్నీ క్రమంగా మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దమవుతున్నాయి.

‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో కొంత వెనక్కి తగ్గిన విజయ్.. ఈసారి మరింత కేర్ తీసుకుంటున్నాడు. కథాపరంగా, కమర్షియల్ వైపులు బలంగా ఉండేలా స్క్రిప్ట్ చక్కగా రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ‘రౌడీ జనార్దన్’ రూపొందుతోంది. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్ మిక్స్‌తో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా సినిమా రాబోతున్నట్లు టాక్.

దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ ఫలితం బలహీనంగా వచ్చినా, ఈ ప్రాజెక్టుపై ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. రవికిరణ్ కోలా గతంలో ‘రాజావారు రాణిగారు’ అనే సినిమా ద్వారా తన మార్క్ చూపించాడు. ఆ నేటివిటీ టచ్‌ను విజయ్ స్టైల్‌తో మిక్స్ చేస్తే పక్కా కమర్షియల్ సినిమా వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. దీనికి తోడు కీర్తి సురేష్ లాంటి వెర్సటైల్ హీరోయిన్ ఎంటరైతే, సినిమా బజ్ మ‌రింత పెరిగే అవకాశం ఉంది.