ఇండియన్ ఆర్మీకి అండగా రౌడీ `నేను సైతం`!
ఇదిలా ఉంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
By: Tupaki Desk | 9 May 2025 1:22 PM ISTదాయాది పాకిస్థాన్ వక్రబుద్దిని ప్రదర్శిస్తూ గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రవాదాన్ని, తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తూ మనపై దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఇంత కాలం సహనం, శాంతి అంటూ ఓపికగా ఎదురు చూసిన భారత్ పహల్గావ్ ఘటనతో పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆపరేషన్ మొదలు పెట్టి షాక్ ఇచ్చింది. ఆక్రమిత పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఈ నెల 7న అర్థ్ర రాత్రి మెరుపు దాడులు చేసింది.
పీఓకేలెఓ ఉన్న ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేసి పాక్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ హఠాత్పరిణామానికి షాక్ కు గురైన పాక్ మన స్థావరాలపై దొంగదెబ్బతీసే ప్రయత్నం చేసింది. దీనికి ధీటుగా స్పందించిన ఇండియన్ ఆర్మీ దాయిది దేశంపై మెరుపు దాడులు చేయడం మొదలు పెట్టింది. ఇండియన్ ఆర్మీ ధైర్యసాహసాలు, పాక్ కుటిలత్వాన్ని దెబ్బతీస్తున్న తీరుకు ఫిదా అవుతున్న సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సైన్యానికి మద్దతు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.
భారత్ మాతాకీ జై అంటూ ఇండియన్ ఆర్మీకి అండగా నిలుస్తున్నారు. మేమున్నాం ధైర్యంగా ముందుకు సాగండి అంటూ ప్రోత్సహిస్తున్నారు. ఇదిలా ఉంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. `నాట్ జస్ట్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా` రాబోయే వారాలకు `రౌడీ బ్రాండ్ అమ్మకాల్లో కొంత భాగాన్ని భారత సాయుధ దళాలకు విరాళంగా అందిస్తాం. జై హింద్ మీ విజయ్` అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దాయాది దేశంతో యుద్ధం జరుగుతున్న వేళ నేను సైతం అంటూ రౌడీ హీరో ఇలా ముందుకు రావడంతో అభిమానులు, సినీ లవర్స్ విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ `కింగ్‌డమ్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించినప ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. విజయ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
