విజయ్ దేవరకొండ.. ఆ సినిమాతోనే ఫస్ట్..
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు సరైన కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 2 Dec 2025 11:45 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు సరైన కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు భారీ హిట్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఫుల్ గా కష్టపడుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉండగా.. అందులో ఒకటి రౌడీ జనార్థన్ కాగా.. మరొకటి VD 14. ఆ రెండు సినిమాల షూటింగ్స్ జరుగుతుండగా.. ఒకదానికొకటి భిన్నంగా ఉండనున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న సినిమాల్లో ఒకటి రా, రస్టిక్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కుతోంది. మరొకటి పీరియాడిక్ డ్రామాగా సిద్ధమవుతోంది.
ఇప్పుడు అటు రౌడీ జనార్ధన్ మూవీ.. ఇటు VD 14 ప్రాజెక్ట్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు విజయ్. రెండు చిత్రాల చిత్రీకరణలతో బిజీగా గడుపుతున్నారు. కానీ ఇప్పుడు రౌడీ జనార్థన్ మూవీకి వరుసగా కొన్ని నెలలపాటు బల్క్ డేట్స్ ను విజయ్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలల పాటు ఆ సినిమా షూటింగ్ లోనే పాల్గొనున్నారట.
అది కంప్లీట్ అయ్యాక.. VD 14 సినిమాను విజయ్ పూర్తి చేయనున్నారని సమాచారం. దీంతో VD 14 కన్నా ముందే రౌడీ జనార్థన్ (VD 15) ప్రాజెక్ట్ థియేటర్స్ లో రిలీజ్ కానుందని చెప్పాలి. నిజానికి.. రీసెంట్ గా రౌడీ జనార్థన్ మూవీ నిర్మాత దిల్ రాజు విడుదలపై క్లారిటీ ఇచ్చారు. 2026లో సినిమాను రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా తెలిపారు.
విజయ్ తో చర్చించాకే దిల్ రాజు అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు హీరో కంటిన్యూ డేట్స్ ఇవ్వడంతో రౌడీ జనార్థన్ మేకర్స్.. వరుస షెడ్యూల్స్ ను ఫిక్స్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే క్లైమాక్స్ ను షూట్ చేయనున్నారని సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్న మేకర్స్.. మరికొద్ది రోజుల్లో మొదలుపెట్టనున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఆయన.. మూవీలో విజయ్ ను చాలా విభిన్నంగా చూపించనున్నారని సమాచారం. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.
