రౌడీ జనార్దన్ నెక్స్ట్ సమ్మర్ టార్గెట్..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ త్వరలో రిలీజ్ అవుతుండగా నెక్స్ట్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.
By: Tupaki Desk | 23 May 2025 11:20 AM ISTరౌడీ హీరో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ త్వరలో రిలీజ్ అవుతుండగా నెక్స్ట్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు రౌడీ జనార్ధన్ టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా లాక్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది. రౌడీ జనార్ధన్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమా విషయంలో యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
సినిమా స్క్రిప్ట్ దశలోనే పక్కా హిట్ అనేలా ఉందట. రవికిరణ్ కోలా విజయ్ దేవరకొండ లోని మాస్ యాక్షన్ అంశాలను పర్ఫెక్ట్ గా వాడుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను నెక్స్ట్ మంత్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లి ఆరు నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నారట.
ఇక ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో తీసుకు రావాలని చూస్తున్నారట. విజయ్ దేవరకొండ కీర్తి సురేష్ జంటగా రాబోతున్న ఈ రౌడీ జనార్ధన్ రౌడీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమా పోస్టర్ లో కత్తి నాదే నెత్తురు నాదే యుద్ధం నాతోనే అంటూ యాక్షన్ సినిమాగా ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ రవికిరణ్.
దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా లాస్ట్ ఇయర్ ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు. ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయినా సరే మరోసారి దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా చేయబోతున్నాడు. విజయ్ దేవరకొండ దిల్ రాజు రవికిరణ్ కోలా ఈ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది. మరి రౌడీ జనార్ధం మాస్ హంగామాతో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఫ్యాన్స్ కి సూపర్ జోష్ అందించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. రౌడీ జనార్ధన్ తర్వాత విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో పెట్టాడు.
