రౌడీ జనార్దన్ మాస్టర్ ప్లాన్..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్ డం సినిమా చేస్తున్నాడు.
By: Tupaki Desk | 11 April 2025 8:15 AM ISTరౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్ డం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సితార బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అంచనాలు పెంచింది. మే లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న కింగ్ డం సినిమాతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా తర్వాత ఈ హీరో మరో క్రేజీ సినిమాతో రాబోతున్నాడు.
రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఒక సినిమా వస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సూపర్ బజ్ ఉంది. సినిమా అనౌన్స్ మెంట్ తోనే కత్తి నాదే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే అంటూ ఒక అదిరిపోయే డైలాగ్ తో సినిమా ప్రకటించారు. అప్పటి నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా కూడా ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అన్న ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు.
విజయ్ దేవరకొండ రవి కిరణ్ కోలా కాంబో సినిమాకు రౌడీ జనార్ధన్ అనే టైటిల్ లాక్ చేశారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాలో విజయ్ కి జతగా మహానటి కీర్తి సురేష్ ని లాక్ చేశారని తెలుస్తుంది. రవి కిరణ్ కోలా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయగా త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాను 3, 4 నెలల్లో పూర్తి చేసేలా పర్ఫెక్ట్ షెడ్యూల్ వేసుకున్నారట.
అలా జరిగితే మాత్రం విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ సినిమా ఈ ఇయర్ లోనే డిసెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ లు ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో దిల్ రాజు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. ఆల్రెడీ దిల్ రాజుతో విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా చేయగా అది కాస్త డిజప్పాయింట్ చేసింది. ఐతే రౌడీ జనార్ధన్ విషయంలో మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా నటించబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. విజయ్ కింగ్ డం రిలీజ్ కాగానే రౌడీ జనార్ధన్ మీద ఫోకస్ చేయనున్నాడని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా రౌడీ జనార్థన్ అనేది హీరోకి పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పుకుంటున్నారు.
