దేవరకొండపై పోలీసుల విచారణ
రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ కేసును విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
By: Tupaki Desk | 22 Jun 2025 11:15 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండపై హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రెట్రో మూవీ ప్రచారం వేదికపై గిరిజనులను కించపరుస్తూ కామెంట్ చేసాడు అంటూ గిరిజన సంఘాల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.
అయితే రెట్రో మూవీ ప్రచార వేదికపై తాను అన్న మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని విజయ్ దేవరకొండ అప్పట్లో వివరణ ఇచ్చారు. తన మాటలు తప్పుగా ఉంటే క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. అయినా గిరిజన సంఘాలు వెనక్కి తగ్గలేదు. రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ కేసును విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత కొంత గ్యాప్ తో ఖుషి, ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చాడు. కల్కి 2898 ఏడిలో అతిథి పాత్రలో నటించాడు. ప్రస్తుతం అతడి హోప్స్ అన్నీ `కింగ్ డమ్` పైనే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సి ఉన్నా వాయదా పడింది. త్వరలోనే ఈ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాల్లో ఉంది. ఈ స్పై యాక్షన్ కామెడీ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై ఎస్. నాగ వంశీ - సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
