Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్ తో టైమ్ ను ఆస్వాదిస్తున్నా: విజయ్ దేవరకొండ

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ.. తాను సింగిల్ కాదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   27 July 2025 1:00 AM IST
గర్ల్ ఫ్రెండ్ తో టైమ్ ను ఆస్వాదిస్తున్నా: విజయ్ దేవరకొండ
X

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ.. తాను సింగిల్ కాదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలిపారు. కానీ ఎవరితో అనేది ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. అయితేనేం.. హీరోయిన్ రష్మిక మందన్నతోనే ఆయన ప్రేమలో ఉన్నారని అభిమానులు, సినీ ప్రియులు అంతా ఫిక్స్ అయిపోయారు.

అందుకు కారణాలు లేకపోలేదు. ఇద్దరూ వెంటవెంటనే ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలో విజయ్, రష్మిక పోస్ట్ చేసిన పిక్స్ లో బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇద్దరూ కలిసే సందడి చేస్తుంటారు. రీసెంట్ గా కార్ లో కనిపించారు. దీంతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు డిసైడ్ అయిపోయారు.

ఇప్పుడు తాజాగా ఆయన చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అవి రష్మిక కోసమేనని అంతా అంటున్నారు. తన అప్ కమింగ్ మూవీ కింగ్డమ్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ సందడి చేస్తున్నారు. ఆ సమయంలో రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు.

మానవ సంబంధాలు ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనవని విజయ్ దేవరకొండ తెలిపారు. గత రెండేళ్ల కాలంలో తనకు వాటి విలువ స్పష్టంగా తెలిసొచ్చిందని చెప్పారు. గత రెండు, మూడేళ్లుగా తన జీవించిన విధానం తనకే నచ్చలేదని అన్న విజయ్.. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడపలేదని తెలిపారు.

అమ్మానాన్న, స్నేహితులు, గర్ల్‌ ఫ్రెండ్ అలా ఎవరికీ కూడా సమయాన్ని కేటాయించలేదని చెప్పారు. ఆ విషయాన్ని తానే ఒకరోజు గ్రహించానని తెలిపిన విజయ్ దేవరకొండ.. అప్పటి నుంచి పద్ధతి మార్చుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు వాళ్ల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నానని, విలువైన టైమ్‌ ను ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు విజయ్.

అయితే విజయ్ చెప్పిన గర్ల్ ఫ్రెండ్ రష్మికనే అని అంతా కామెంట్లు పెడుతున్నారు. ఆయన చెప్పినట్లే.. నిజంగానే కొంతకాలంగా ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపిస్తున్నారని అంటున్నారు. కాగా, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలకు గాను విజయ్, రష్మిక స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పుడే వారు ప్రేమలో పడినట్లు సమాచారం. మరి అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.