రష్మిక మందన్న రిప్లైకి అర్థం అదేనా?
తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ వారు పెట్టిన ఓ పోస్ట్‌కు రష్మిక రిప్లై ఇవ్వడంతో ఆ వార్తలు నిజమేనని క్లారిటీ వచ్చేసింది.
By: Tupaki Desk | 3 May 2025 4:41 PM ISTవెండితెరపై కొన్ని జంటలకున్న క్రేజ్ మరే జంటకూ ఉండదు. కారణం వారిద్దరి మధ్య కనిపించే కెమిస్ట్రీనే. ఆ కెమిస్ట్రీ కారణంగానే ప్రేక్షకులు హిట్ పెయిర్ మళ్లీ మళ్లీ కలిసి నటిస్తే చూడాలని ముచ్చటపడుతుంటారు. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ జోడీ కలిసి నటించే చూడాలని అభిమానులు, సినీలవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జోడీ మరెవరో కాదు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరిద్దరు కలిసి 'గీత గోవిందం'లో తొలిసారి నటించారు. వీరి కెమిస్ట్రీ వర్కవుట్ కావడంతో సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించింది.
ఇక ఆ తరువాత కలిసి చేసిన మూవీ 'డియర్ కామ్రేడ్'. ఇది కేవలం రష్మిక కోసమే విజయ్ చేసినట్టుగా ఉంటుంది. 'గీత గోవిందం' అంత కాకపోయినా ఆడియన్స్‌ని మాత్రం విశేషంగా ఆకట్టుకుని ఈ జంటకు హిట్ పెయిర్ అనే ముద్ర వేసింది. 2019లో ఈ మూవీ విడుదలైంది. ఆ తరువాత నుంచి వీరిద్దరు కలిసి మరో సినిమాలో నటించలేదు. మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్దరు కలిసి నటించబోతున్నారనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. తాజాగా మైత్రీ మూవీమేకర్స్ వారు పెట్టిన ఓ పోస్ట్‌కు రష్మిక రిప్లై ఇవ్వడంతో ఆ వార్తలు నిజమేనని క్లారిటీ వచ్చేసింది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందుతున్న 'కింగ్‌డమ్'లో నటిస్తున్న విషయం తెలిసిందే. పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ నెల 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీని తరువాత రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడిక్ డ్రామాలో నటించనున్నాడు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. ఈ భారీ మూవీ వచ్చే నెల హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది.
ఇందులో విజయ్‌కి జోడీగా రష్మిక నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై నిర్మాణ సంస్థ తాజాగా 'వేచి చూద్దాం' అని అర్థం వచ్చేలా ఓ పోస్ట్ పెట్టింది. దానికి రష్మికను ట్యాగ్ చేసింది. దీనికి రష్మిక రిప్లైగా 'ఓకె' అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. దీంతో చాలా గ్యాప్ తరువాత రౌడీ, రష్మికల జోడీ ఖరారైందని అభిమానులు భావిస్తున్నారు. రష్మిక ఇదే విషయాన్ని తాజాగా కన్షర్మ చేసిందని చెబుతున్నారు. ఇదే నిజమైతే మరో సారి క్రేజీ జోడీ స్క్రీన్‌పై సందడి చేయడం ఇక లాంఛనమే.
