Begin typing your search above and press return to search.

బీచ్ లో విజయ్.. రష్మిక ఎక్కడని క్వశ్చన్స్.. ఇంకెప్పుడు చెప్తారో?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   7 April 2025 1:08 PM IST
Vijay Deverakonda Rashmika Strong Dating Rumours
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో ఎప్పటికప్పుడు ఆ విషయంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరూ కూడా లవ్ మ్యాటర్ పై క్లారిటీ ఇవ్వడం లేదు.


కానీ నెటిజన్లు, ఫ్యాన్స్ అంతా ఫుల్ గా ఫిక్సయిపోయారు. ఎందుకంటే పండుగలన్నీ ఇద్దరూ కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ అకేషన్స్ కు వెకేషన్స్ కూడా ఎప్పటికప్పుడు వెళ్తున్నారు. కానీ కలిసి వెళ్తున్నట్టు చెప్పడం లేదు. పిక్స్ కూడా కలిసి దిగినవి పెట్టడం లేదు. అయినా అందరికీ క్లియర్ గా తెలిసిపోతుంది.


రీసెంట్ గా రష్మిక తన బర్త్ డే సందర్భంగా వెకేషన్ కు వెళ్లారు. బీచ్.. సాండ్.. సన్ సెట్స్.. అంటూ కొన్ని పిక్స్ ను షేర్ చేయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు.. విజయ్ దేవరకొండ ఎక్కడ అని అంతా కామెంట్లు పెట్టారు. ఇంతలో విజయ్ రీసెంట్ గా బీచ్ లో దిగిన పిక్స్ ను షేర్ చేశారు.

కాటన్ బ్యాగీ దుస్తుల్లో గుర్రంపై షికారు చేస్తూ కనిపించిన విజయ్ పిక్స్.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు రష్మిక ఎక్కడ ఉంది బ్రో అని క్వశ్చన్ చేస్తున్నారు. అదే సమయంలో ఇద్దరూ కలిసే వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తుందని.. బ్యాక్ గ్రౌండ్ సేమ్ ఒకేలా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

అయితే విజయ్, రష్మిక.. ఈసారి విడివిడిగా వెళ్లినట్లు తెలుస్తోంది. రష్మిక ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ముందు రోజు.. విజయ్ విమానాశ్రయంలో కనిపించారు. దీంతో ఒమన్ కు విజయ్ వెళ్లిన తర్వాత.. రష్మిక వెళ్లినట్లు సమాచారం. మొత్తానికి ఇద్దరూ ఒకే చోట ఉన్నారని.. రిలేషన్ షిప్ లో ఉండడం పక్కా అని చెబుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో కింగ్ డమ్ మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఆ తర్వాత రెండు సినిమాలను లైన్లో పెట్టేశారు. మరోవైపు, సికంద‌ర్ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక.. ఇప్పుడు మరిన్ని చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి విజయ్, రష్మిక తన అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి హిట్స్ కొడతారో వేచి చూడాలి.