Begin typing your search above and press return to search.

పెళ్లి కోసం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చేసిందిగా?

టాలీవుడ్ క్రేజీ ల‌వ్ బ‌ర్డ్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికమంద‌న్న ఈ ఇద్ద‌రు త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతున్నార‌ని వార్త‌లు షికారు చేస్తున్న‌విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Feb 2026 6:00 PM IST
పెళ్లి కోసం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చేసిందిగా?
X

టాలీవుడ్ క్రేజీ ల‌వ్ బ‌ర్డ్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికమంద‌న్న ఈ ఇద్ద‌రు త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతున్నార‌ని వార్త‌లు షికారు చేస్తున్న‌విష‌యం తెలిసిందే. అక్టోబ‌ర్‌లో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. అత్యంత స‌న్నిహితులు, కుటుంబ స‌బ్యులు మాత్ర‌మే పాల్గొన‌గా ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లా ఈ కార్య‌క్ర‌మంలా దీన్ని నిర్వ‌హించిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. అయితే దీనిపై అటు విజ‌య్ దేవ‌ర‌కొండ కానీ, ఇటు ర‌ష్మిక మంద‌న్న కానీ స్పందించ‌లేదు. మీడియా అడిగినా స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే పెళ్లి గురించి వెల్ల‌డిస్తాన‌ని ర‌ష్మిక చెప్పిందే కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని వివాహం చేసుకుంటున్నాన‌ని మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు.

దీంతో సినీ అభిమానుల్లో చాలా క‌న్‌ఫ్యూజ‌న్ నెల‌కొంది. ఇంత‌కీ వీరిద్ద‌రి వివాహం జ‌రుగుతుందా? అది ప్ర‌చార‌మేనా? అని అభిమానులు తీవ్ర గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త కొన్ని రోజులుగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రష్మిక‌ల వివాహం ఫిబ్ర‌వ‌రిలో జ‌రుగుతుందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫిబ్ర‌వ‌రి 26న ఉద‌య్‌పూర్‌లో అత్యంత అట్ట‌హాసంగా భారీ డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. దీనిపై ఇంత వ‌ర‌కు విజ‌య్ దేవ‌ర‌కోండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల టీమ్ నుంచి క్లారిటీ లేదు.

అలా అని దీన్ని వారు ఖండించ‌నూ లేదు. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికల వివాహం ఉద‌య్‌పూర్‌లోని ప్యాలెస్‌లో అత్యంత భారీ స్థాయిలో జ‌ర‌గ‌నుంద‌నే సంకేతాలు మొద‌ల‌య్యాయి. దాన్ని నిజం చేస్తూ ర‌ష్మిక మంద‌న్న త‌న సినిమాల షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చేసింద‌ని తెలుస్తోంది. ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం మైసా, కాక్‌టేయిల్ 2తో పాటు బ‌న్నీ న‌టిస్తున్న భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీలోనూ న‌టిస్తోంది. `పుష్ప`తో అద‌రిగొట్టిన ఈ జోడీ మ‌రోసారి అట్లీ మూవీ కోసం జోడీ క‌డుతున్నారు.

అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా ర‌ష్మిక ఇందులో న‌టిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. దీపికా ప‌దుకునే, మృణాల్ ఠాకూర్‌, జాన్వీ క‌పూర్‌లు కూడా ఇందులో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. అయితే దీపికని మాత్ర‌మే ఇంత వ‌ర‌కు టీమ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. కానీ ర‌ష్మిక మంద‌న్న కూడా ఇందులో బ‌న్నీకి స‌మాన‌మైన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి త‌న‌తో పాటు యాక్ష‌న్ ఘ‌ట్టాల్లో ఫైట్‌లు కూడా చేస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఇండోర్‌లో జ‌ర‌గ‌నున్న ఈ షూటింగ్‌లో అల్లు అర్జున్‌, ర‌ష్మిక‌, జాన్వీక‌పూర్‌, జిమ్ స‌ర్బ్ పాల్గొన‌నున్నార‌ని, వీరిపై ప‌లు కీల‌క యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని ద‌ర్శ‌కుడు అట్లీ చిత్రీక‌రించ‌నున్నాడ‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి.

#AA22xA6 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ తాజా షెడ్యూల్‌ ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు సాగుతుంద‌ట‌. అయితే ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో వివాహం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ర‌ష్మిక బ‌న్నీ, అట్లీల మూవీకి బ్రేక్ ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. బ‌న్నీ మూవీతో పాటు మిగ‌తా షూటింగ్‌ల‌కు కూడా ర‌ష్మిక బ్రేక్ ఇవ్వ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండంతో పెళ్లి కోసం ర‌ష్మిక రెడీ అవుతోంద‌ని సంకేతాల్ని అందిస్తోంద‌ని ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 26న జ‌ర‌గ‌బోయే వివాహం కోసం అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి పెళ్లి రోజైనా ఆ విష‌యాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక అధికారికంగా వెల్ల‌డిస్తారో..లేక ప్రైవేట్ ఈవెంట్ అని పెళ్లిని కూడా సీక్రెట్‌గా దాచేస్తారో వేచి చూడాల్సిందే.