పెళ్లికి విజయ్ రెడీ!.. మరి 'గర్ల్ ఫ్రెండ్' సంగతేంటి?
కానీ ఎప్పుడు పెళ్లి చేసుకోనున్నారనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 27 July 2025 10:36 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. రీసెంట్ గా తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన అప్ కమింగ్ మూవీ కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. ఆ సమయంలో తాను కుటుంబసభ్యులతో సమయం గడపలేదని కొంతకాలం క్రితం గ్రహించానని తెలిపారు.
అందుకే ఇప్పుడు తల్లిదండ్రులు, గర్ల్ ఫ్రెండ్ తో విలువైన సమయాన్ని గడుపుతున్నానని.. ఫ్యూచర్ లో ఇంకా గడపాలని ఉందని తెలిపారు. దీంతో ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ చెప్పిన గర్ల్ ఫ్రెండ్.. హీరోయిన్ రష్మిక మందన్ననేనని ఇప్పుడు మరోసారి స్ట్రాంగ్ గా ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు.
ఎందుకంటే.. ఎప్పటి నుంచో వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వస్తున్నా.. కొంతకాలంగా మాత్రం ఎప్పటికప్పుడు కలిసే కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఒకే కారులో డిన్నర్ డేట్ కు వెళ్తూ కెమెరాకు చిక్కారు. ఆ తర్వాత పలుమార్లు కూడా కలిసి కనిపించారు. దీంతో వారిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది.
కానీ ఎప్పుడు పెళ్లి చేసుకోనున్నారనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రీసెంట్ గా మరో ఇంటర్వ్యూలో తన 35 ఏళ్ల వయసులో ఆలోచనలన్నీ స్థిరపడటం వైపే ఉన్నాయని విజయ్ చెప్పారు. అలా పరోక్షంగా.. వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లే అనిపిస్తోంది.
అది బాగానే ఉన్నా.. రష్మిక సంగతేంటనేది ఇప్పుడు స్పష్టత లేదు.పెళ్లికి హీరో రెడీగానే ఉన్నాడు గానీ.. హీరోయిన్ కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అలా రష్మిక లైనప్ లో బోలెడు చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే.
రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన రష్మిక.. ఆ వ్యవహరాల్లో కూడా బిజీగా ఉన్నారు. మొత్తానికి ఇప్పట్లో ఆమె పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనపడడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరో ఏడాది తర్వాత వివాహం చేసుకుంటారేమోనని అంటున్నారు. ప్రస్తుతం ఆమె ప్రణాళికలు చూస్తే అలాగే ఉందని చెబుతున్నారు. ఏదేమైనా విజయ్- రష్మిక ఎప్పుడు పెళ్లి చేసుకుంటారోనని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
