Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్ రష్మిక.. బాయ్ ఫ్రెండ్ తో ఎప్పుడు..?

విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కలిసి చేయాలనే ప్లానింగ్ లో ఉన్న సరైన కథ కుదరట్లేదని టాక్.

By:  Tupaki Desk   |   16 April 2025 9:30 PM
గర్ల్ ఫ్రెండ్ రష్మిక.. బాయ్ ఫ్రెండ్ తో ఎప్పుడు..?
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమాలో ఉంది అంటే అది పక్కా పాన్ ఇండియా రిలీజ్ తో పాటుగా సూపర్ హిట్ అందుకోవడం ఫిక్స్ అని ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. మొన్నటి వరకు సౌత్ సినిమాల్లో సత్తా చాటిన అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ అందుకుంటుంది. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో రష్మిక స్టామినా ప్రూవ్ అయ్యింది. ఆ సినిమాల్లో రష్మిక ఉండటం సినిమాలకు కూడా లక్కీ అనిపించేలా క్రేజ్ తెచ్చుకుంది.

ఐతే ప్రస్తుతం రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్ తో పాటు కుబేర సినిమాలు చేస్తుంది. ఈ సినిమాల తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఐతే రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమాలో బాయ్ ఫ్రెండ్ వాయిస్ ఓవర్ అందించాడు. అదే బయట జనాలు చెప్పుకుంటున్నట్టుగా విజయ్, రష్మిక ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. విజయ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక అయితే.. ఆమె బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ అంటున్నారు.

ఐతే వాళ్లిద్దరు మాత్రం ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేయట్లేదు. ఇదిలాఉంటే విజయ్ దేవరకొండ రష్మిక ఆఫ్ స్క్రీన్ విషయాలు ఏంటన్నది పక్కన పెడితే ఆన్ స్క్రీన్ ఈ ఇద్దరి జోడీ చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలను కలిసి నటించిన విజయ్, రష్మిక ఆ తర్వాత మళ్లీ జత కట్టలేదు. ఐతే మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటించే రోజు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కలిసి చేయాలనే ప్లానింగ్ లో ఉన్న సరైన కథ కుదరట్లేదని టాక్. ప్రస్తుతం విజయ్ కింగ్ డమ్ లో ఆల్రెడీ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. నెక్స్ట్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమాకు కీర్తి సురేష్ ని తీసుకున్నారని టాక్. ఐతే ఆ తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమాలో రష్మిక నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని బయట రకరకాల వార్తలు వినపడుతున్నా వాటిని ఆపేందుకైనా ఇద్దరు కలిసి ఒకసారి నటిస్తే బాగుంటుందని అటు విజయ్ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఐతే గీతా గోవిందం సూపర్ హిట్ కాగా డియర్ కామ్రెడ్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఈసారి చేసే సినిమా పక్కా సూపర్ హిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరు సరైన కథ కోసమే ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ వెయిటింగ్ ఎన్నాళ్లు అన్నది చూడాలి.