Begin typing your search above and press return to search.

సొంత జెట్ లో ఫ్యామిలీతో దేవ‌ర‌కొండ వెకేష‌న్!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మందికి ఓన్ ప్ర‌యివేట్ జెట్లు ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్, బ‌న్నీ, ప్ర‌భాస్ ఇలా దాదాపు స్టార్ హీరోలంద‌రు ఓన్ జెట్స్ క‌లిగి ఉన్నారు.

By:  Tupaki Desk   |   4 May 2025 2:30 PM
సొంత జెట్ లో ఫ్యామిలీతో దేవ‌ర‌కొండ వెకేష‌న్!
X

టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మందికి ఓన్ ప్ర‌యివేట్ జెట్లు ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్, బ‌న్నీ, ప్ర‌భాస్ ఇలా దాదాపు స్టార్ హీరోలంద‌రు ఓన్ జెట్స్ క‌లిగి ఉన్నారు. వెకేష‌న్ల‌కు వెళ్లాల‌నుకున్న స‌మ‌యంలో వాటిని వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీస్ తో క‌లిసి వెళ్లాల‌నుకున్న స‌మ‌యంలో ఓన్ జెట్స్ లోనే ప్ర‌యాణాన్ని ఆస్వాదిస్తుంటారు. త‌ర్వాత జ‌న‌రేష‌న్ హీరోల్లో ప్ర‌యివేట్ జెట్స్ అంటూ ఎవ‌రికీ లేవు.

అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం సొంతంగా జెట్ కొనుగోలు చేసిన‌ట్లు రివీల్ చేసాడు. ఈ మ‌ధ్య‌నే జ‌రిగిన కుంభ‌మేళ‌కు విజ‌య్ ఫ్యామిలీతో పాటు స్నానాలు అచ‌రించిన సంగ‌తి తెలిసిందే. అలాగే కొన్ని వెకేష‌న్స్ కు సైతం ఫ్యామిలీతోనే వెళ్లాడు. సాధార‌ణంగా వెకేష‌న్లు అంటే సింగిల్ గా వె ళ్తుంటారు. కానీ విజ‌య్ మాత్రం కుటుంబంతో ప్ర‌తీసారి క‌లిసి వెళ్తుంటాడు. తాజాగా అందుకు గ‌ల సీక్రెట్ ని రివీల్ చేసాడు.

`ఖాళీ స‌మ‌యం దొరికితే విదేశాల‌కు వెళ్తుంటా. అలా వెళ్ల‌డం వ‌ల్ల ఆ ఆనందం నాకు మాత్ర‌మే ద‌క్కు తుంది. న‌న్ను క‌న్న త‌ల్లిదండ్రులు మాత్రం ఆ సంతోషం చూడ‌లేక‌పోతున్నారు. అందుకే సొంతంగా ఓ ప్ర‌యివేట్ జెట్ ను కొన్నాను. ఇప్పుడు నా త‌ల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న కుక్క కూడా నాతో పాటు వ‌స్తున్నారు. అమ్మ నాన్న‌ను తొలిసారి అమెరికా తీసుకెళ్లా. అప్పుడు వాళ్ల క‌ళ్ల‌లో ఆనంద‌మే వేరు.

ఇదే సంతోషం నా అభిమానుల‌కు కూడా క‌లిగితే బాగుంటుంద‌నిపించింది. అందుకే ఆ మ‌ధ్య నా అభిమా నుల్లో కొంత మందిని ఎంపిక చేసిన ఖ‌ర్చుల‌న్నీ నేనే భ‌రించి వాళ్ల‌ను మ‌నాలీకి పంపించాను. వాళ్లంతా మ‌నాలీలో ఐదు రోజుల పాటు ఎంజాయ్ చేసి వ‌చ్చారు. అప్పుడు వాళ్ల క‌ళ‌లో ఆనందం నాకు కొట్లు ఇచ్చినా రాద‌నిపించింది` అన్నారు.