Begin typing your search above and press return to search.

దిల్ రాజుతో విజయ్.. ఈసారి హై వోల్టేజ్ ప్రాజెక్ట్!

ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అతని కోపం..హింసలో ప్రేమ.. అంటూ ఒక క్యాప్షన్ తో పవర్ఫుల్ పోస్టర్ ను హైలెట్ చేశారు.

By:  Tupaki Desk   |   9 May 2025 8:47 PM IST
దిల్ రాజుతో విజయ్.. ఈసారి హై వోల్టేజ్ ప్రాజెక్ట్!
X

మొదటి నుంచి కూడా డిఫరెంట్ కంటెంట్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ కూడా నెవ్వర్ బిఫోర్ అనే సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇక అతనితో సినిమాలు చేస్తున్న ప్రొడక్షన్ సంస్థలు విజయ్ దేవరకొండ తన బర్త్‌డే సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. 'వీడీ14' టీమ్ ఈ రోజు ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాహుల్ సంకృత్యాయన్ డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బర్త్‌డే ట్రీట్‌గా నిలిచింది.

ఇక దిల్ రాజు SVC ప్రొడక్షన్ లో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదివరకే ఈ సంస్థలో విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా చేశారు. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అతని కోపం..హింసలో ప్రేమ.. అంటూ ఒక క్యాప్షన్ తో పవర్ఫుల్ పోస్టర్ ను హైలెట్ చేశారు.

అతని పవర్ఫుల్ బాడీ చిస్తుంటే రఫ్ క్యారెక్టర్ తో మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతుంది. ఇది ఓ హై-ఓక్టేన్ రూరల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకుడు. ఇక విజయ్ దేవరకొండ కెరీర్ 'నువ్విలా', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాల్లో చిన్న పాత్రలతో ప్రారంభమైంది. 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో అతను గుర్తింపు సాధించాడు, ఆ తర్వాత 'పెళ్లి చూపులు' సినిమా అతనికి జాతీయ అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది.

'అర్జున్ రెడ్డి' సినిమా అతని కెరీర్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలిచి, యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ను సృష్టించింది. ఇక ఆ తరువాత ట్యాక్సీవాలా, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, ఖుషి సినిమాలతో మరింత గుర్తింపు అందుకున్నాడు. ఇక 2019లో స్థాపించిన ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కోవిడ్ సమయంలో 17,000 కుటుంబాలకు సాయం అందించాడు, 'ఖుషి' సక్సెస్ తర్వాత 100 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాడు.

ప్రతి ఏడాది విజయ్ దేవరసాంటా కార్యక్రమం ద్వారా కూడా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తాడు. ఇక రాబోయే సినిమాల విషయానికొస్తే, మే 30న 'కింగ్‌డమ్' సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా అతని కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. అలాగే రాహుల్ దర్శకత్వంలో మరో పిరియాడ్ డ్రామా లో నటిస్తున్నాడు.