స్పీడు పెంచేసిన రౌడీ హీరో!
`లైగర్` తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ కాస్త తడబాటుకు గురైందనే చెప్పాలి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోగా రౌడీ కెరీర్‌ని ప్రశ్నార్థకంలో పడేసింది.
By: Tupaki Desk | 17 Dec 2025 10:00 PM IST`లైగర్` తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ కాస్త తడబాటుకు గురైందనే చెప్పాలి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోగా రౌడీ కెరీర్‌ని ప్రశ్నార్థకంలో పడేసింది. దీని నుంచి తేరుకుని చిన్న చిన్నగా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశాడు. 'కింగ్‌డమ్' తో కాస్త ఫరవాలేదు అనిపించిన విజయ్ దేవరకొండ ఈ సారి ఎలాగైనా తన మార్కు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇందులో భాగంగానే సినిమాల విషయంలో స్పీడు పెంచాడు. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ దఫా పక్కా ప్రణాళికతో విభిన్నమైన కథలని ఎంచుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవి కిరణ్ కోల డైరెక్షన్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న `రౌడీ జనార్ధన`తో పాటు `టాక్సీ వాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్‌లో ఓ భారీ పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నాడు.
ఇందులో రవికిరణ్‌కోలా తెరకెక్కిస్తున్న 'రౌడీ జనార్థన' రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి సారి రౌడీతో కలిసి కీర్తి చేస్తున్న సినిమా ఇదే. ఈ మూవీ టీజర్‌ని డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కొత్త తరహాలో చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్ చేస్తున్న మూవీ 1854కు సంబంధించిన బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ ఫిల్మ్. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ ఓస్ట్లు ని దించేస్తున్నారు. ఇందులో తను కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేశారు. బ్రీటీష్ కాలం నాటి కథ కావడంతో పూర్తిగా సెట్‌లలోనే షూటింగ్ చేస్తున్నారట. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక సన్నివేశాన్ని మాత్రం అనంతపురంలో కానీ కర్నూలులో కానీ షూట్ చేయాలని దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది.
ఈ రెండు సినిమాల షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపేస్తున్న విజయ్ దేవరకొండ వీటిని రాకెట్ స్పీడుతో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా కెరీర్ ప్రారంభంలో ఉన్న జోష్‌ని మళ్లీ ఈ రెండు సినిమాలతో తిరిగి పొందాలని, మళ్లీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాలనే పట్టుదలతో రౌడీ స్టార్ పట్టుదలతో పని చేస్తున్నాడని రౌడీ ఫ్యాన్స్ చెబుతున్నారు.
