న్యూ గెటప్..మీసం తిప్పిన రౌడీ
విజయ్ న్యూ గెటప్ `రౌడీ జనార్ధన్` కోసమేనా అని అంతా ఆరా తీస్తున్నారు. `కింగ్‌డమ్` తరువాత విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మించనున్న `రౌడీ జనార్థన్`తో పాటు మరో పీరియాడిక్ ఫిల్మ్‌లో నటించనున్న విషయం తెలిసిందే. ట్యాక్సీవాలా
By: Tupaki Desk | 27 Jun 2025 6:11 PM ISTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన మార్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి చాలా రోజులవుతోంది. `డియర్ కామ్రేడ్` వరకు తన ఫామ్‌ని కొనసాగించిన ఈ రౌడీ హీరో `వరల్డ్ ఫేమస్ లవర్`తో పట్టుకోల్పోయాడు. అక్కడి నుంచి తనదైన మార్కు సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించాలని ప్రయత్నించినా ఫలించడం లేదు. `లైగర్`తో రేసు నుంచి మరింత వెనక్కి వెళ్లిన విజయ్ ఈ సారి ఏలాగైనా మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని ట్రాక్‌లోకి రావాలనే పట్టుదలతో ఉన్నాడట. తను నటిస్తున్న లేటెస్ట్ మూవీ `కింగ్‌డమ్`.
ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ`తో ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని మెప్పించిన గౌతమ్ తిన్ననూరి దీనికి దర్శకుడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. `మిస్టర్ బచ్చన్`తో ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయిన గ్లామరస్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇందులో విజయ్‌కి జోడీగా నటిస్తోంది. ఇందులో యంగ్ హీరో సత్యదేవ్ విలన్. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీని పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అయితే రిలీజ్ మాత్రం ఎప్పుడన్నది ఇప్పటికీ కన్ఫ్యూజన్ గానే ఉంది. ఇదిలా ఉంటే విజయ్ దేరకొండ ఇటీవల అంతర్జాతీయ మాదవ ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. బ్రౌన్ కలర్ డ్రెస్‌లో కనిపించి సందడి చేశారు. అయితే తన గెటప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. షార్ట్ హెయిర్ కట్‌తో మెలేసిన మీసంతో విజయ్ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది.
విజయ్ న్యూ గెటప్ `రౌడీ జనార్ధన్` కోసమేనా అని అంతా ఆరా తీస్తున్నారు. `కింగ్‌డమ్` తరువాత విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మించనున్న `రౌడీ జనార్థన్`తో పాటు మరో పీరియాడిక్ ఫిల్మ్‌లో నటించనున్న విషయం తెలిసిందే. ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాల దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్‌లో ఈ పీరియాడిక్ ఫిల్మ్ చేయబోతున్నాడు. దీన్ని మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మీసం మెలేసి కనిపిస్తున్న విజయ్ దేవరకొండ మేకోవర్ రాహుల్ సంక్రీత్యన్ పీరియాడిక్ డ్రామా కోసమా లేక `రౌడీ జనార్థన్` కోసమా అన్నది తెలియాల్సి వుంది.
అయితే గతంలో మైత్రీ మూవీమేకర్స్ విజయ్ దేవరకొండతో ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం చూస్తే విజయ్ లేటెస్ట్ లుక్ ఆ ప్రాజెక్ట్ కోసమే అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓ లెజెండ్ స్టోరీ అంటూ ప్రకటించిన పోస్టర్‌లో భారీ రాతి శిలపై మీసం మెలేసి చేతిలో ఖడ్గాన్ని ధరించి గుర్రంపై ఓ రాజు కనిపిస్తున్న స్టిల్ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఇదే నిజమైతే రౌడీ ఫ్యాన్స్‌కి పండగే.
