పని ఒత్తిడిలో పడి జీవించడం మర్చిపోతున్నాం..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా చేస్తాడనే విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 17 May 2025 12:32 PM ISTటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా చేస్తాడనే విషయం తెలిసిందే. విజయ్ తల్లి మాధవి రీసెంట్ గా విజయ్ ను ఓ చిన్న కోరిక కోరగా విజయ్ దాన్ని నెరవేర్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని అందరికీ తెలుసు.
ఎక్కడకు వెళ్లినా ఫ్యామిలీతో వెళ్తూ, కుదిరినప్పుడల్లా వెకేషన్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు విజయ్. ఏదైనా పండగొచ్చినా విజయ్ తన ఫ్యామిలీతోనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ మధ్య కింగ్‌డమ్ సినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు విజయ్. దీంతో ఫ్యామిలీకి మునుపటిలా టైమ్ కేటాయించలేకపోతున్నాడు.
తన కొడుకు బిజీగా ఉన్న టైమ్ లో విజయ్ తల్లి విజయ్ ను ఈ వారంలో అందరం కలిసి బయటికెళ్లి డిన్నర్ చేసొద్దామా అని మెసేజ్ పెట్టగా దానికి వెంటనే విజయ్ రెస్పాండ్ అయి, వెళ్దాం అని చెప్పగానే ఈ వీకెండ్ నీకు కుదురుతుందా చిన్ను అని ప్రేమగా అడిగింది. దానికి విజయ్ మంచి రెస్టారెంట్‌లు ఏమున్నాయో చూస్తానమ్మా అంటూ మెసెజ్ పెట్టాడు.
అమ్మ కోరిక మేరకు డిన్నర్ ను ప్లాన్ చేసిన విజయ్, ఆ ఫోటోలతో పాటూ తన తల్లితో జరిగిన వాట్సాప్ చాట్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మన రోజూవారి పనులు, టార్గెట్స్, గోల్స్ అంటూ పరిగెడుతూ, చిన్న చిన్న మూమెంట్స్ ను ఫీల్ అవడం, వాటిలో బతకడం మర్చిపోతున్నామని, అందుకే మేమిలా బయటికొచ్చి టైమ్ స్పెండ్ చేశాం, మీరు కూడా మీ పేరెంట్స్ తో టైమ్ గడపడాన్ని మర్చిపోకండి, అప్పుడప్పుడు వాళ్లను బయటకు తీసుకెళ్లండని విజయ్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు.
తల్లిదండ్రులకు ముద్దులు, హగ్స్ ఇస్తూ ప్రేమను కురిపించండి, మీకు, మీ పేరెంట్స్ ను నా తరపున ప్రేమను పంపిస్తున్నాననంటూ విజయ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్‌డమ్ చేస్తున్న విజయ్, ఆ సినిమాను మే 30 న రిలీజ్ చేయాల్సింది కానీ ఇప్పుడు దాన్ని జులై 4కు వాయిదా వేశారు.
